ఔత్సాహికులకు నాసా ఆఫర్‌

ఔత్సాహిక యువ ఇంజినీర్లకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒక ఆఫర్‌ ప్రకటించింది. 2030 నాటికి అంగార గ్రహంపైకి మానవ సహిత వ్యోమనౌకను పంపేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. అంతరిక్ష నౌకలోని వ్యోమగాములకు రక్షణ కల్పించే విధంగా గొప్ప డిజైన్‌ను రూపొందించే యువ సాంకేతిక నిపుణులకు 30 వేల డాలర్ల అవార్డ్‌ను ప్రకటించింది. ఇటీవలే అంతరిక్షంలో రేడియేషన్‌ను తట్టుకునేవిధంగా సలహాలు ఇచ్చినందుకు ఐదుగురు సాంకేతిక నిపుణలకు ఒక్కొక్కరికి 12వేల డాలర్ల చొప్పున అవార్డులు బహుక‌రించింది. 2025 […]

Advertisement
Update: 2015-04-21 00:08 GMT

ఔత్సాహిక యువ ఇంజినీర్లకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒక ఆఫర్‌ ప్రకటించింది. 2030 నాటికి అంగార గ్రహంపైకి మానవ సహిత వ్యోమనౌకను పంపేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. అంతరిక్ష నౌకలోని వ్యోమగాములకు రక్షణ కల్పించే విధంగా గొప్ప డిజైన్‌ను రూపొందించే యువ సాంకేతిక నిపుణులకు 30 వేల డాలర్ల అవార్డ్‌ను ప్రకటించింది. ఇటీవలే అంతరిక్షంలో రేడియేషన్‌ను తట్టుకునేవిధంగా సలహాలు ఇచ్చినందుకు ఐదుగురు సాంకేతిక నిపుణలకు ఒక్కొక్కరికి 12వేల డాలర్ల చొప్పున అవార్డులు బహుక‌రించింది. 2025 నాటికి ఒక ఆస్టరాయిడ్‌పైకి, 2030 నాటికి అంగారక గ్రహంపైకి మనుషులను పంపాలని అమెరికా లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంతరిక్షంలో మనుషులు ఎదుర్కొనే అత్యంత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపడంలో ఔత్సాహికులు చూపిస్తున్న ఉత్సాహం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని నాసా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News