కాల్చుకు తింటున్న భానుడు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలకు జనం ఠారెత్తిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయంటే ఇక వచ్చేరోజులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ తగ్గిపోతుండడంతో ఇరు రాష్ట్రాల్లో వడగాలుల తాకిడి పెరిగింది. పిల్లలు, వృద్ధులు, శ్రామికులు అల్లాడుతున్నారు. ఈ ఏడాది కరవు పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, గాలిలో తేమ శాతం పడిపోవడంతో వచ్చే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలోని […]
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ఎండలకు జనం ఠారెత్తిపోతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయంటే ఇక వచ్చేరోజులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ తగ్గిపోతుండడంతో ఇరు రాష్ట్రాల్లో వడగాలుల తాకిడి పెరిగింది. పిల్లలు, వృద్ధులు, శ్రామికులు అల్లాడుతున్నారు. ఈ ఏడాది కరవు పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, గాలిలో తేమ శాతం పడిపోవడంతో వచ్చే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలోని దాదాపు అన్ని వాతావరణ కేంద్రాల్లోనూ ఆదివారం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కావలి, నందిగామ, నెల్లూరు, అనంతపూర్, తిరుపతి, కడపల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్ఠంగా నాలుగు డిగ్రీల మేరకు అధికంగా నమోదయ్యాయి. తెలంగాణలోని అన్ని వాతావరణ కేంద్రాల్లో గరిష్ఠంగా 3 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.-పీఆర్
Advertisement