Telugu Global
NEWS

సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రం తెలంగాణ

సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో 'ఎక్స్‌ పీరియన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌'ను ఆయన ప్రారంభించారు. 'ఎక్స్‌ పీరియన్‌' సంస్థ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. డేటా, అన‌లిటిక‌ల్ టూల్స్ రంగంలో వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్న సంస్థ‌గా ఎక్స్‌ పీరియ‌న్‌ కు గుర్తింపు ఉంది. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన ఈ సంస్థ, హైదరాబాద్‌ వేదికగా 'ఎక్స్‌ పీరియన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌' ఏర్పాటు చేసింది. […]

సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రం తెలంగాణ
X

సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో 'ఎక్స్‌ పీరియన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌'ను ఆయన ప్రారంభించారు. 'ఎక్స్‌ పీరియన్‌' సంస్థ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉంది.

డేటా, అన‌లిటిక‌ల్ టూల్స్ రంగంలో వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్న సంస్థ‌గా ఎక్స్‌ పీరియ‌న్‌ కు గుర్తింపు ఉంది. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన ఈ సంస్థ, హైదరాబాద్‌ వేదికగా 'ఎక్స్‌ పీరియన్‌ గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌' ఏర్పాటు చేసింది. ఇలాంటి ప్రముఖ కంపెనీ హైదరాబాద్‌ లో ఇన్నోవేషన్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయడం.. తెలంగాణ ఐటీ అభివృద్ధికి మరింత ఊతంగా మారుతుంది.

ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌ లో సాంకేతిక కేంద్రాలు, ఆవిష్కరణల హబ్‌ లను వరుసగా ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు మంత్రి కేటీఆర్. పెట్టుబడులకు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అత్యంత విశ్వసనీయకేంద్రంగా ఉందని చెప్పారు కేటీఆర్.

అన్ని రంగాల్లో అనుకూలతలు ఉన్నాయి కాబట్టే ప్రపంచ స్థాయి సంస్థలన్నీ ఇటువైపు చూస్తున్నాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సమాచార సేవల సంస్థ ఎక్స్‌ పీరియన్‌ సహా ఇతర దిగ్గజ సంస్థలు ఇక్కడికి రావడానికి కారణం అదేనన్నారు.

హైదరాబాద్‌ ను వినూత్న ఐటీ హబ్‌ గా మార్చడంలో ఎక్స్‌ పీరియన్‌ ఆవిష్కరణల కేంద్రం సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత, విశ్లేషణలు, ఆవిష్కరణల సహాయంతో వ్యాపార, ఆర్థిక, వినియోగ వ్యవస్థలు బలోపేతమవుతాయని చెప్పారు కేటీఆర్. ఈ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తుందని హామీ ఇచ్చారు.

తెలంగాణలో అత్యుత్తమ ప్రభుత్వ, పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలకు ఆకర్షితులమై ఇక్కడ ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఎక్స్‌ పీరియన్‌ సంస్థ ప్రతినిధులు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమన్నారు, అదే సమయంలో తమ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకి తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రదేశంగా తాము భావిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి మరింత స్కోప్ ఉందని చెప్పారు.

First Published:  13 July 2022 12:58 AM GMT
Next Story