Telugu Global
NEWS

భారతి సిమెంట్స్‌కు కేంద్రం ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, ప్రోత్సాహకాలు దక్కాయి. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసింది. రానున్న రెండేళ్లకు గాను రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద 2 కోట్ల 40 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ […]

భారతి సిమెంట్స్‌కు కేంద్రం ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌
X

ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, ప్రోత్సాహకాలు దక్కాయి. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసింది. రానున్న రెండేళ్లకు గాను రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద 2 కోట్ల 40 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో మైన్స్ అండ్ మినరల్స్ పై జరిగిన సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా చేతుల మీదుగా ఏపీ మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి అవార్డును, ప్రోత్సాహకాన్ని అందుకున్నారు.

దేశంలో ప్రధాన ఖనిజాల మైనింగ్ పై అత్యుత్తమ విధానాలు అనుసరిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర గనుల శాఖ ఏటా అవార్డులు ప్ర‌దానం చేస్తోంది. రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. గత రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం పలు రకాల అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల్లో పారదర్శకతతో పాటు అత్యుత్తమ విధానాలను ఏపీ అనుసరిస్తోందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.

మైనింగ్ రంగంలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలేనని గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సూచన మేరకే మైనింగ్ రంగంలో అత్యుత్తమ విధానాలకు సృజనాత్మకతను జోడించి సంస్కరణలు తెచ్చినట్లు వివరించారు.

అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఫైవ్‌ స్టార్ రేటింగ్‌ను కేటాయించింది. నేషనల్ కాంప్లెర్‌లో భారతి సిమెంట్‌ కేంద్ర గనుల శాఖ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించినందుకు గాను.. ఆ సంస్థ యాజమాన్యానికి గోపాలకృష్ణ ద్వివేది అభినందనలు తెలిపారు. వరుసగా మూడేళ్లు సస్టెయినబుల్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలను అనుసరించిందుకు గాను భారతి సిమెంట్‌కు ఈ గౌరవం దక్కింది.

First Published:  12 July 2022 10:12 PM GMT
Next Story