Telugu Global
MOVIE UPDATES

యశోద షూటింగ్ అప్ డేట్స్

సమంత లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా యశోద. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ను 100 రోజుల్లో పూర్తి చేశారు. ప్రస్తుతానికి సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా […]

యశోద షూటింగ్ అప్ డేట్స్
X

సమంత లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా యశోద. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత.

సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ను 100 రోజుల్లో పూర్తి చేశారు. ప్రస్తుతానికి సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ పని కూడా జరుగుతుంది.

సమంత కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతోంది యశోద. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాతే మంచి డేట్ చూసి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు. సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, దివ్య శ్రీపాద కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

First Published:  11 July 2022 11:01 PM GMT
Next Story