Telugu Global
MOVIE UPDATES

లైగర్ పాట.. ఈ కాలంలో ఆ స్టెప్ ఏంటి బాసూ!

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "లైగర్"(సాలా క్రాస్‌బ్రీడ్) ఫస్ట్ సింగల్ 'అక్డీ పక్డీ' ఫుల్ సాంగ్ రిలీజైంది. అక్డీ పక్డీ మెస్మరైజింగ్ మాస్ బీట్స్ తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించింది. వివిధ భాషల గాయకులందరూ ఈ పార్టీ ట్రాక్‌ ని అద్భుతంగా ఆలపించారు. టైటిల్ కు తగ్గట్టే సాంగ్ కూడా క్రాస్ బీట్ లో సాగింది. అటు పూర్తి హిందీ పాట కాదు, ఇటు పూర్తి తెలుగు పాట […]

లైగర్ పాట.. ఈ కాలంలో ఆ స్టెప్ ఏంటి బాసూ!
X

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ "లైగర్"(సాలా క్రాస్‌బ్రీడ్) ఫస్ట్ సింగల్ 'అక్డీ పక్డీ' ఫుల్ సాంగ్ రిలీజైంది. అక్డీ పక్డీ మెస్మరైజింగ్ మాస్ బీట్స్ తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించింది. వివిధ భాషల గాయకులందరూ ఈ పార్టీ ట్రాక్‌ ని అద్భుతంగా ఆలపించారు. టైటిల్ కు తగ్గట్టే సాంగ్ కూడా క్రాస్ బీట్ లో సాగింది. అటు పూర్తి హిందీ పాట కాదు, ఇటు పూర్తి తెలుగు పాట కూడా కాదు.

లిజో జార్జ్-డిజె చేతాస్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ ఫాస్ట్ గా స్టెప్పులేశాడు. విజయ్‌ కి జోడీగా అనన్య పాండే కూడా గట్టిగా డాన్స్ చేసింది. అంతా బాగుంది కానీ, రెండున్నర నిమిషాల సాంగ్ లో చివర్లో విజయ్ దేవరకొండతో వేయించిన స్టెప్ మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కిందట తెలుగు హీరోలు వేసిన స్టెప్పులవి. నితిన్ అయితే అలాంటి స్టెప్పుల్ని పిండి రుబ్బేశాడు.

పోనీ ఆ డాన్స్ మూమెంట్ లో అయినా గ్రేస్ ఉందా అంటే అది కూడా లేదు. హీరోను నేలపై పడుకోబెట్టి, వైర్లు కట్టి లాగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు పాన్ ఇండియా సినిమా అంటూ కలరింగ్ ఇస్తూ, మరోవైపు ఇలా నేలబారు స్టెప్పులు వేయించడం చీప్ గా ఉంది.

ఈ స్టెప్ సంగతి పక్కనపెడితే.. పాటలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తెలుగులో అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఈ సాంగ్ ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు.

First Published:  11 July 2022 9:25 PM GMT
Next Story