Telugu Global
NEWS

ముర్మును క‌లిసే చాన్స్‌ ఇవ్వండి- టీడీపీ విజ్ఞప్తి

టీడీపీ తన చరిత్రలో ఎన్నడూ చూడని అవమానకర పరిస్థితులను ఇప్పుడు చవిచూస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఏదో ఒక పక్షం రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు కోరకపోతుందా అని ఇంత కాలం తెలుగుదేశం పార్టీ ఎదురుచూసింది. అయితే అటు ప్రతిపక్షాల అభ్యర్థి నుంచి కానీ ఇటు అధికార ఎన్‌డీఏ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు కోరుతూ ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. పైగా నేడు ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి […]

ముర్మును క‌లిసే చాన్స్‌ ఇవ్వండి- టీడీపీ విజ్ఞప్తి
X

టీడీపీ తన చరిత్రలో ఎన్నడూ చూడని అవమానకర పరిస్థితులను ఇప్పుడు చవిచూస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఏదో ఒక పక్షం రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు కోరకపోతుందా అని ఇంత కాలం తెలుగుదేశం పార్టీ ఎదురుచూసింది. అయితే అటు ప్రతిపక్షాల అభ్యర్థి నుంచి కానీ ఇటు అధికార ఎన్‌డీఏ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు కోరుతూ ఎలాంటి విజ్ఞప్తి రాలేదు.

పైగా నేడు ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. పలు రాజకీయ పార్టీలను ఆమె కలిసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కలవబోతున్నారు . ఈ నేపథ్యంలో బీజేపీ విజ్ఞప్తి చేయకపోయినా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ ముర్ముకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం ఆసక్తిగా మారింది. టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు.

” మేం మద్దతు ఇచ్చాం కదా.. అభ్యర్థిని కలిసేందుకు పిలవరా” అంటూ ఆయన కిషన్ రెడ్డితో వ్యాఖ్యానించారు. అంటే ద్రౌపది ముర్ముకు తాము కూడా మద్దతు ప్రకటించాం కాబట్టి ఆమెను కలిసే అవకాశం ఇవ్వాలి అని తెలుగుదేశం పార్టీ బీజేపీ పెద్దలను వేడుకున్నట్టుగా అయింది.

ఎంపీ కనకమేడల ప్రతిపాదనకు స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసలు తెలుగుదేశం పార్టీ తమ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిన అంశం ఇప్పటికీ తనకు తెలియదని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై పార్టీ పెద్దలతో మాట్లాడుతానని వారి సూచనల ఆధారంగా మీకు సమాచారం ఇస్తానని.. కనకమేడలతో కిషన్ రెడ్డి చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికలకు ముందు మమత బెనర్జీ, చంద్రబాబు కలిసి జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడం, ఎన్‌డీఏ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. మమతా బెనర్జీపై కేంద్ర ప్రభుత్వం వేధింపులకు దిగినా చంద్రబాబు మాత్రం కనీసం సంఘీభావం కూడా తెలపలేదు.

అప్పటినుంచి మమతా బెనర్జీ కూడా చంద్రబాబుపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అటు మమతా బెనర్జీ నుంచి కానీ, ఇతర ప్రతిపక్షాల నుంచి కానీ చంద్రబాబు నాయుడుకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదు. దీంతో ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ అభ్యర్థికే ఎవరు అడక్కపోయినా స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

First Published:  11 July 2022 8:25 PM GMT
Next Story