Telugu Global
National

జనాభా పెరుగుదలపై అబ్బాస్ నక్వి సంచలన వ్యాఖ్యలు

ఓ వైపు ఇండియాలో జనాభా పెరిగిపోతోందని, మరో మరో మూడేళ్లకు చైనా జనాభా సంఖ్యను దాటేస్తుందని వార్తలు వస్తుంటే మరో వైపు దేశంలో జనాల సంఖ్య పెరిగినా ఆందోళన వద్దంటున్నారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అబ్బాస్ నక్వి. ఏ మతానికైనా జనాభా పెరుగుదల అన్నది ముప్పు కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా పెరుగుదల ‘దినోత్సవం’ సందర్భంగా యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో జనాభా అదుపునకు చట్టాలు […]

జనాభా పెరుగుదలపై అబ్బాస్ నక్వి సంచలన వ్యాఖ్యలు
X

ఓ వైపు ఇండియాలో జనాభా పెరిగిపోతోందని, మరో మరో మూడేళ్లకు చైనా జనాభా సంఖ్యను దాటేస్తుందని వార్తలు వస్తుంటే మరో వైపు దేశంలో జనాల సంఖ్య పెరిగినా ఆందోళన వద్దంటున్నారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అబ్బాస్ నక్వి.

ఏ మతానికైనా జనాభా పెరుగుదల అన్నది ముప్పు కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా పెరుగుదల ‘దినోత్సవం’ సందర్భంగా యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో జనాభా అదుపునకు చట్టాలు రావాలన్న డిమాండ్ పెరుగుతుండగా రాజకీయాలు కూడా ఇందులో ఎంటరయ్యాయి. జనాభా అదుపు విషయంలో ప్రజలు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని, ఏ మతానికైనా ఇది అసలు ప్రమాదమే కాదని నక్వి పేర్కొన్నారు.

దీన్ని కుల, మతాలకు ముడిపెట్టకండి అని నక్వి కోరారు. ప్రజలు ఈ విషయంలో తమ అభిప్రాయాలు మార్చుకోవాలన్నట్టు ఆయన సూచించారు. జనాభా పెరుగుదలను ఓ మతానికి ఆపాదించకండి.. ఇది సమంజసం కాదు.. ఇది దేశం మొత్తానికి సంబంధించిన సమస్య అని ఆయన ట్వీట్ చేశారు. తన రాజ్యసభ . సభ్యత్వం ముగియడంతో ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తరుణంలో నక్వి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

(ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ ఈయనను తమ అభ్యర్థిగా ప్రతిపాదించనున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి). ఇక అంతకుముందు మాట్లాడిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. జనాభా అదుపు ముఖ్యమేనని అదే సమయంలో వివిధ మతాల మధ్య అసమానత అన్నది తలెత్తిన పక్షంలో అది గందరగోళానికి, అయోమయానికి దారి తీస్తుందన్నారు.

కుటుంబ నియంత్రణ ముఖ్యమే.. కానీ సమాజం ఆరోగ్యంగా, వ్యాధుల రహిత ‘వ్యవస్థ’ లా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కుటుంబ నియంత్రణ గురించి మనం మాట్లాడుకుంటున్నామని, ఇది సక్సెస్ ఫుల్ గా సాగాలని, కానీ ‘పాపులేషన్ ఇన్ బ్యాలన్స్ ‘ అన్నది జరగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. అంటే ఈ విషయంలో హెచ్చు తగ్గులు ఉంటున్నాయని ఆయన అన్నారు.

గత 5 దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణపై అవగాహనకు ఉద్దేశించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. వ్యాధులు, నైపుణ్య కొరత వంటివి ఉన్న పక్షంలో జనాభా పెరుగుదల ఓ సవాలుగా మారుతుందని యోగి అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో పెరుగుతున్న జనాభా పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో 135 కోట్ల నుంచి 140 కోట్ల జనాభా ఉందని, ఇదే సమయంలో 24 కోట్ల జనాలతో యూపీ దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రంగా ఉందని ఆయన చెప్పారు.

మరికొద్ది రోజుల్లో ఇది 25 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని చెప్పిన ఆయన.. ఈ ‘స్పీడ్’ ఓ సవాలు వంటిదని, దీన్ని స్థిరీకరించడానికి ప్రయత్నాలు జరగవలసి ఉందని పేర్కొన్నారు. అసలు ఈ ఏడాది అంతానికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుందని నిపుణులు భావిస్తున్నారని ఆయన తెలిపారు.

First Published:  12 July 2022 3:07 AM GMT
Next Story