Telugu Global
International

జపాన్ లో కొత్త చట్టం.. ఆన్ లైన్ అవమానాలకు జైలు శిక్ష..

జపాన్ లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఆన్ లైన్ లో ఎవరినైనా అవమానించినట్టు తేలితే ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారు. లేదా 3 లక్షల యెన్ లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవమానం అంటే పూర్తి స్థాయిలో నిర్వచనం ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఈ చట్టం భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందో లేదో తెలుసుకోవడానికి 2025లో మళ్లీ దీన్ని […]

Japan New Law
X

జపాన్ లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఆన్ లైన్ లో ఎవరినైనా అవమానించినట్టు తేలితే ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారు. లేదా 3 లక్షల యెన్ లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవమానం అంటే పూర్తి స్థాయిలో నిర్వచనం ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఈ చట్టం భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందో లేదో తెలుసుకోవడానికి 2025లో మళ్లీ దీన్ని పునఃపరిశీలిస్తారు.

ఎందుకు తేవాల్సి వచ్చింది..?

గతేడాది టెలివిజన్ స్టార్ హనా కిమురా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులనుంచి అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెను ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేసిన వ్యక్తులకు 9వేల యెన్ లు జరిమానా విధించింది ప్రభుత్వం.

ఆ తర్వాత ఈ చట్టం గురించి ఆలోచన చేసింది. గతంలో ఇలాంటి ఆన్ లైన్ అవమానాలకు, బెదిరింపులకు జపాన్ చట్టాల ప్రకారం గరిష్టంగా 30 రోజులు జైలుశిక్ష విధించేవారు. లేదా 10,000 యెన్లు జరిమానా విధించేవారు. ప్రస్తుతం సవరించిన చట్టం ప్రకారం దీన్ని ఏడాది జైలు శిక్ష లేదా 3 లక్షల యెన్ ల జరిమానాకు పెంచారు.

అవమానాన్ని నిర్వచించేది ఎలా..?

ఎవరైనా జపాన్ లో రాజకీయ నాయకుడిని ఇడియట్ అని తిడితే గతంలో నేరం, అదే తిట్టుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది నేరం కాదు. కానీ ఇప్పుడు అది కూడా నేరం అని వర్గీకరిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆన్ లైన్ అవమానాలను నిర్వచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు జపాన్‌ కు చెందిన ప్రముఖ క్రిమినల్ లాయర్ సీహో చో.

ప్రస్తుతం భారత్ లో ఇలాంటి అవమానాలకు పరువు నష్టం దావాలు వేస్తుంటారు. మన దేశంలో ఎవరినైనా తిట్టాలంటే వారి పేరుని కాస్త వక్రీకరించి తిట్టేవారు, ఇప్పుడు నేరుగా వారి పేర్లను పెట్టే తిట్టేస్తున్నారు. భారత్ లో కూడా ఆన్ లైన్ తిట్ల దండకాలకు శిక్ష వేస్తామంటే మన జైళ్లు సరిపోవేమో.

First Published:  14 July 2022 1:30 AM GMT
Next Story