Telugu Global
NEWS

ముందు పార్లమెంట్ రద్దు చేయండి, ఆ తర్వాతే అసెంబ్లీ..

బీజేపీకి దమ్ముంటే ముందు పార్లమెంట్ ని రద్దు చేయాలని, ఆ తర్వాతే తెలంగాణ అసెంబ్లీని రద్దు విషయం ఆలోచిస్తామని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్ ఒకలా మాట్లాడితే బీజేపీ నేతలు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఐదేళ్లపాటు అధికారం ఇచ్చారని, బీజేపీ నేతలు ఫుట్ పాత్ మీద ఉన్నారు కాబట్టి ఏవైనా మాట్లాడతారని అన్నారు. ప్రధాని కూర్చునే ఢిల్లీలో అధికారం బీజేపీది కాదని, ఆమ్ ఆద్మీ పార్టీదని గుర్తు చేశారు. […]

ముందు పార్లమెంట్ రద్దు చేయండి, ఆ తర్వాతే అసెంబ్లీ..
X

బీజేపీకి దమ్ముంటే ముందు పార్లమెంట్ ని రద్దు చేయాలని, ఆ తర్వాతే తెలంగాణ అసెంబ్లీని రద్దు విషయం ఆలోచిస్తామని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్ ఒకలా మాట్లాడితే బీజేపీ నేతలు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఐదేళ్లపాటు అధికారం ఇచ్చారని, బీజేపీ నేతలు ఫుట్ పాత్ మీద ఉన్నారు కాబట్టి ఏవైనా మాట్లాడతారని అన్నారు. ప్రధాని కూర్చునే ఢిల్లీలో అధికారం బీజేపీది కాదని, ఆమ్ ఆద్మీ పార్టీదని గుర్తు చేశారు. ఢిల్లీలో కూడా గెలవలేని బీజేపీ, తెలంగాణలో ఏం చేస్తుందని సెటైర్లు వేశారు.

ఏక్ అణా అయినా తెచ్చారా..?

ముందస్తు ఎన్నికలకోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ నేతలు మాటలు కట్టిపెట్టి చేతల్లోకి దిగాలని సూచించారు. అసలు తెలంగాణ అసెంబ్లీలో మీ బలమెంత, మీ స్థానమేంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఒకసీటు, ఉప ఎన్నికల్లో రెండుసీట్లు గెలుచుకున్నారని, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా మోదీ దగ్గరకు వెళ్లి 4 ప్రాజెక్ట్ లు ఇప్పించాలని కోరండని సూచించారు. అలా చేస్తే తెలంగాణలో బీజేపీ బలపడుతుందని బతిమిలాడుకోవాలన్నారు. ఇప్పటి వరకూ ఒక్క అణా కూడా తెలంగాణకు తేలేని ప్రజా ప్రతినిధులు ఇక్కడ అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని మండిపడ్డారు.

అంతా ఔట్ డేటెడ్ గాళ్లే..

చేరికలంటూ హడావిడి చేస్తున్న పార్టీలు అంతా ఔట్ డేటెడ్ గాళ్లతో నిండిపోతున్నాయని ఎద్దేవా చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేనివారు, రిటైర్మెంట్ కేసులు.. వీరిని చేర్చుకోని ఏదో బలం పెరిగిపోయిందని విర్రవీగడం ఏంటని ప్రశ్నించారు. ఆరు నూరైనా తెలంగాణలో మళ్లీ వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు తలసాని. యాదాద్రిని ప్రభుత్వ నిధులతో సీఎం కేసీఆర్‌ పునర్నిర్మించారని, బీజేపీ నాయకులు తెలంగాణలో ఒక్క దేవాలయాన్నయినా నిర్మించారా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కడూ సీఎంను ఏక వచనంతో మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిందని, తాము కూడా మోదీ గురించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.

First Published:  11 July 2022 8:07 PM GMT
Next Story