Telugu Global
National

పోటెత్తుతున్న వరదలు… ప్రాణ, ఆస్థినష్టం జరగకుండా కాపాడలేని తుపాను హెచ్చరిక కేంద్రాలు

దేశంలో రుతుపవనాల ప్రభావం తీవ్రమవుతున్న కొద్దీ భారీ వర్షాలు, వరదలు అనేక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది మొదట అసోంలో మొదలైన ప్రకృతి బీభత్సం ఆ తరువాత అనేక రాష్ట్రాలను కుదిపేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ట్రాల్లో జల విలయం సృష్టిస్తున్న బీభత్సం ఇంతాఅంతా కాదు. అమర్ నాథ్ లో జ్యోతిర్లింగ్ దర్శనానికి వెళ్లిన వందలాది యాత్రికుల్లో సుమారు 40 మంది మొదట సంభవించిన […]

పోటెత్తుతున్న వరదలు… ప్రాణ, ఆస్థినష్టం జరగకుండా కాపాడలేని తుపాను హెచ్చరిక కేంద్రాలు
X

దేశంలో రుతుపవనాల ప్రభావం తీవ్రమవుతున్న కొద్దీ భారీ వర్షాలు, వరదలు అనేక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది మొదట అసోంలో మొదలైన ప్రకృతి బీభత్సం ఆ తరువాత అనేక రాష్ట్రాలను కుదిపేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ట్రాల్లో జల విలయం సృష్టిస్తున్న బీభత్సం ఇంతాఅంతా కాదు. అమర్ నాథ్ లో జ్యోతిర్లింగ్ దర్శనానికి వెళ్లిన వందలాది యాత్రికుల్లో సుమారు 40 మంది మొదట సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతు కాగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా మేఘాలు గర్జించాయి. ఎవరూ ఊహించనట్టుగా ఒక్కసారిగా కుండపోత వర్షం, ఈదురుగాలులతో యాత్రికులు పడిన అవస్థలు వర్ణనాతీతం.. చివరకు వారిని రక్షించడానికి రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ లో కూడా కొంతమంది జవాన్లు గల్లంతయ్యారు. అసలు దేశంలో ఇన్ని వాతావరణ కేంద్రాలు, తుపాను హెచ్చరిక సెంటర్లు ఉండి కూడా ప్రాణాలను, ఆస్తులను కాపాడలేకపోతున్నాయి. వరదలు, తుపానులు సంభవిస్తే ఈ నష్టాలను నివారించడానికి అత్యంత ఆధునిక, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మనకు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రజలకు ముందుగా సమాచారమివ్వలేని,లోపభూయిష్టమైన, సరైన సైన్టిఫిక్ డేటా అంటూ లేని వ్యవస్థలు మన లోపాలను చెప్పకనే చెబుతున్నాయి. లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ అంటూ లేదు.. సిబ్బందికి సరైన అవగాహన అంతకన్నా లేదు.

2021 లో ఇండియాలో తౌక్తే, యాస్ తుపానులు ఒక విధంగా దేశ ఆర్థిక వ్యవస్థనే చాలావరకు చిదిమేశాయంటే అతిశయోక్తి లేదు. ప్రపంచంలో సంభవించిన అతి ప్రమాదకరమైన 10 క్లైమేట్ ఈవెంట్స్ లో ఈ రెండూ కూడా ఉన్నాయట. విపరీత ప్రాణ నష్టంతో బాటు వీటిలో ఒక్కో తుపాను కారణంగా వందకోట్ల రూపాయల విలువైనఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. 2010-2021 మధ్య తుపానుల కారణంగా జరిగిన జన నష్టం అంతాఇంతా కాదు. ఇండియాలో వర్షపాత వివరాలను భారత వాతావరణ శాఖ నమోదు చేస్తే నదీమట్టాల పెరుగుదలను సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేస్తుంది.

ఈ సంస్థ దేశవ్యాప్తంగా 1600 హైడ్రోమెటీరియలాజికల్ సైట్స్ ని నిర్వహిస్తోంది. 20 నదీ బేసిన్లను ఈ సైట్లు కవర్ చేస్తున్నాయి. వరదల గురించి ముందుగా హెచ్చరించడానికి వీటిలో పలు సైట్లను వాడుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వంటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. 325 స్టేషన్లలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తోంది. అలెర్టుల విషయంలో ఈ సంస్థ గూగుల్ తో కూడా టై అప్ కుదుర్చుకుంది. భారత వాతావరణ శాఖకు రాడార్ నెట్ వర్క్ సైతం ఉంది పిడుగులు, తుపానుల గురించి ముందుగా హెచ్చరించే వ్యవస్థ ఉంది. హైదరాబాద్ సహా 14 నగరాల్లో ఫఫ్లడ్ మెటీరియలాజికల్ కార్యాలయాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆకస్మిక వరదలు తెచ్చే నష్టం కూడా అపారం. ఈ కారణంగానే ముందుగా దీన్ని 'పసి గట్టడానికి' మోడల్ బేస్డ్ సిస్టం తో కూడిన సైన్టిఫిక్ రీసెర్చ్ అన్నది ముఖ్యమని గత ఏడాది నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది. ఇక యూఎస్ నేషనల్ వెదర్ సర్వీసుతో టై అప్ అయి వాతావరణశాఖ… ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సిస్టంని కూడా ఫాలో అవుతోంది. ఈ సిస్టం కింద ఆగ్నేయాసియా దేశాలకు 6 గంటల నుంచి 24 గంటల ముందుగా వరదలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వవచ్చు. ఈ దేశాల్లో ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. ఇంతటి సిస్టం ఉన్నప్పటికీ మన వ్యవస్థలు 24 గంటలముందుగానైనా వాతావరణాన్ని అంచనా వేయలేకపోతున్నాయని ముంబైలోని క్లైమేట్ స్టడీ సెంటర్.. మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణుడు శ్రీధర్ బాలసుబ్రమణ్యన్ విచారం వ్యక్తం చేశారు. వరదలు, తుపానుల రాకకు కనీసం 48 నుంచి 72 గంటల ముందుగా కచ్చితమైన అంచనా వేసేందుకు 'రోబస్ట్ సిస్టం అన్నది అవసరమని ఆయన సూచించారు. ముంబైలో ఎర్లీ వార్నింగ్ సిస్టం ఉన్నప్పటికీ అది సరిగా పని చేయని కారణంగా భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వేలాది ప్రజలు అవస్థలనెదుర్కొంటున్నారు.

2021-2026 సంవత్సరాలకు గాను ఫ్లడ్ మేనేజ్మెంట్, బోర్డర్ ఏరియా ప్రోగ్రాం కోసం ప్రభుత్వం సుమారు 15 వేల కోట్లను కేటాయించింది. ఈ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రాలు వరదల వంటి పరిస్థితుల సందర్భంలో ప్రాణ, ఆస్థి నష్ఠాల నివారణకు తగిన పథకాలను చేపట్టవచ్చు. ఇండియాలోని నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఆరు కోస్తా రాష్ట్రాలను కవర్ చేస్తోంది. వీటికి 2059 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కేంద్రం ఓ యాప్ ను డెవలప్ చేసింది. ఇది శాటిలైట్ ఇమేజీలను మ్యాపుల రూపంలోనూ, టెక్స్ట్ రూపంలో కూడా కన్వర్ట్ చేయగలదు. ప్రధానంగా ఈ యాప్ సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్య కారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇండియా ఇలాంటి విషయాల్లో ఇంతగా అభివృద్ధి సాధించినా సమాచారాన్ని త్వరితంగా చేరవేయడానికి అవసరమైన కనెక్టివిటీ వ్యవస్థను డెవలప్ చేయలేకపోయిందని ఢిల్లీలోని ఇంధన శాఖ నిపుణుడు అవినాష్ మొహంతీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈయన ఎర్లీ వార్నింగ్ సిస్టం లపై పరిశోధన చేస్తున్నారు. కాగా తుపానుల తీవ్రత పెరగడం, జనాభా పెరుగుదల, జనాల్లో చాలామంది (లక్షల్లో) ప్రకృతి వైపరీత్యాలు సులువుగా బీభత్సం సృష్టించగల ప్రాంతాల్లో నివసించడం వంటి కారణాల వల్ల ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టం లు కూడా సక్రమంగా పని చేయలేకపోతున్నాయని పలువురు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అనేక నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడం, అధికారులకు ప్లానింగ్ అన్నదానిపై సరైన అవగాహన లేక పోవడం వల్ల కూడా నష్టాలు సంభవిస్తున్నాయన్నది వీరి అభిప్రాయం. భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేకమంది గల్లంతయ్యారు. ఇంకా ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ జలవిలయంతో తల్లడిల్లుతున్నాయి. విదేశాల్లో వాతావరణ శాఖలు హిమ పాతం పడినా, వర్షాలు వచ్చినా ఎప్పటికప్పుడు ముందుగానే ప్రజలను హెచ్చరిస్తున్నాయంటే అందుకు వాటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలే కారణమన్న అభిప్రాయాలున్నాయి.

First Published:  12 July 2022 9:23 AM GMT
Next Story