Telugu Global
MOVIE UPDATES

మంచు విష్ణు జిన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

తన సినిమా టైటిల్ పై ఎన్ని వివాదాలు చెలరేగినా మంచు విష్ణు మాత్రం వెనక్కు తగ్గలేదు. తన కొత్త సినిమాకు జిన్నా అనే టైటిల్ నే ఉంచాడు. తాజాగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా జిన్నా. ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్న “జిన్నా” సినిమా నుండి మంచు విష్ణు ఫస్ట్ […]

మంచు విష్ణు జిన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
X

తన సినిమా టైటిల్ పై ఎన్ని వివాదాలు చెలరేగినా మంచు విష్ణు మాత్రం వెనక్కు తగ్గలేదు. తన కొత్త సినిమాకు జిన్నా అనే టైటిల్ నే ఉంచాడు. తాజాగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు.

విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా జిన్నా. ఈషన్ సూర్య హెల్మ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్న “జిన్నా” సినిమా నుండి మంచు విష్ణు ఫస్ట్ లుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ లో మంచు విష్ణు వైట్ & వైట్ డ్రెస్ లుక్ లో కనిపించాడు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ లో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కనిపించడం విశేషం.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణు పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. ఇతగాడు జిన్నాగా ఎలా మారాడన్నది కథ. ఇంతకుముందు విష్ణు నటించిన రెండు చిత్రాలకు పనిచేసిన కోనా వెంకట్, ఈ జిన్నాకు కథ-స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు.

First Published:  11 July 2022 9:21 PM GMT
Next Story