Telugu Global
NEWS

కేసీఆర్ నోట ముందస్తు మాట.. ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి..?

ఏపీ, తెలంగాణ రెండు చోట్లా ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రతిపక్ష పార్టీలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఏపీలో ముందస్తు కోసం టీడీపీ, జనసేన ఉత్సాహంగా ఉన్నాయి. కానీ అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఊసుల్ని కొట్టిపారేసింది. అటు తెలంగాణలో మాత్రం కేసీఆర్ ముందస్తుపై కొత్త చర్చకు తావిచ్చారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం విపక్షాలకు ఉందా అంటూ ఆయన సవాల్ విసిరారు. బీజేపీకి దమ్ముంటే తేదీని ఖరారు చేసి ముందుకు రావాలన్నారు. తాను శాసన సభను రద్దు […]

KCR-Early-elections
X

ఏపీ, తెలంగాణ రెండు చోట్లా ముందస్తు ఎన్నికలొస్తాయని ప్రతిపక్ష పార్టీలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఏపీలో ముందస్తు కోసం టీడీపీ, జనసేన ఉత్సాహంగా ఉన్నాయి. కానీ అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఊసుల్ని కొట్టిపారేసింది. అటు తెలంగాణలో మాత్రం కేసీఆర్ ముందస్తుపై కొత్త చర్చకు తావిచ్చారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం విపక్షాలకు ఉందా అంటూ ఆయన సవాల్ విసిరారు. బీజేపీకి దమ్ముంటే తేదీని ఖరారు చేసి ముందుకు రావాలన్నారు. తాను శాసన సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

బంతి విపక్షాల కోర్టులో..

దమ్ముంటే ముందస్తుకి రండి, మీ ప్రతాపమో మా ప్రతాపమో తేలిపోతుంది అంటూ సహజంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటాయి. ఆ సవాళ్లను అధికార పార్టీలు లైట్ తీసుకోవడం కూడా అంతే సహజం. కానీ కేసీఆర్ మాత్రం ప్రతిపక్షాల నోటికి వారితోటే తాళం వేయించాలనుకున్నారు. ముందస్తు ముచ్చటను తానే హైలెట్ చేశారు. మీకు దమ్ముంటే చెప్పండి నేను అసెంబ్లీ రద్దు చేస్తానంటూ సవాల్ విసిరారు. దీంతో ఒకరకంగా ప్రతిపక్షాలే ఇరుకునపడ్డట్టయింది. షెడ్యూల్ ప్రకారం 2023లో ఎన్నికలు జరిగినా, ముందస్తుకి వెళ్లినా.. 2018 ఫలితాలే రిపీట్ అవుతాయనే భయం ప్రతిపక్షాల్లో ఉంది. అందుకే అటువైపు నుంచి ఇంకా కౌంటర్లు పడలేదు.

ప్రతిపక్షాలు ఎంతమేరకు సిద్ధం..?

తెలంగాణలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, రాష్ట్రమంతా ఎన్నికలొస్తే ఆ స్థాయిలో సిద్ధంగా ఉందని చెప్పలేం. ఇటీవల మోదీ సభతో పెద్దగా ఊపొచ్చిందనీ అనుకోలేం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు ఒకరిద్దరు చేరికతో బీజేపీ బలపడుతుందనీ అనుకోలేం. ఎన్నికలకోసం ఇప్పటినుంచే బీజేపీ సిద్ధమవుతున్నా, ముందస్తు అంటే వారికి ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే కేసీఆర్ సవాల్ ని బీజేపీ స్వీకరించకపోవచ్చు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఇప్పటికే వర్గపోరుతో ఆ పార్టీ సతమతం అవుతోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు ఉంటాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. మధ్యలో చిన్నా చితకా పార్టీలన్నీ కాంగ్రెస్ ఓటుబ్యాంక్ ని టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఈ దశలో పార్టీ పక్కాగా ఎన్నికలకు సిద్ధం కావాలంటే సమయం అవసరం. ముందస్తుకి వెళ్లడం కాంగ్రెస్ కి కూడా ఇష్టం లేదు.

కేసీఆర్ ధైర్యం ఏంటి..?

2023లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకాస్త ముందుగా జరిగితే అది కచ్చితంగా టీఆర్ఎస్ కి పరోక్షంగా మేలు చేసే అంశమే. ఎందుకంటే అసెంబ్లీ గొడవ అయిపోతే.. కేసీఆర్ ఫోకస్ అంతా కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న జాతీయ పార్టీపై పెట్టొచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయన చేతిలో టైమ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతోటే కేసీఆర్ ముందస్తుపై చిన్న హింట్ ఇచ్చారనే విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి. అయితే ఇక్కడ ఆయన బంతిని విపక్షాల కోర్టులోకి నెట్టేశారు. వైరి వర్గాల దమ్మేంటో చూడాలనుకుంటున్నారు. ముందస్తుకి వెళ్లే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. మరి కేసీఆర్ సవాల్ కి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

ALSO READ: తెలంగాణ రాజకీయాల్లో ఏక్ నాథ్ షిండేల రగడ..

First Published:  10 July 2022 8:30 PM GMT
Next Story