Telugu Global
MOVIE UPDATES

సీతారామం.. రష్మిక నుంచి మరో లుక్ రిలీజ్

సీతారామం లో రష్మిక పాత్రని హిజాబ్ ధరించిన లుక్ తో ఆమె పుట్టినరోజు కానుకగా గతంలో పరిచయం చేశారు. శ్రీరామ నవమి రోజున విడుదల చేసిన గింప్స్ లో యుద్ధంలో రామ్, సీత విజయం సాధించేలా అఫ్రీన్ గా రష్మిక కోరుకునేలా ఆసక్తికరంగా చూపించారు. ఇప్పుడు బక్రిద్ సందర్భంగా రష్మిక పాత్రకు సంబంధించి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. హిజాబ్ ధరించిన రష్మిక మందన్న ఈద్ ఉల్-అధా శుభాకాంక్షలను తెలియజేస్తున్న ఈ పోస్టర్ ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో […]

సీతారామం.. రష్మిక నుంచి మరో లుక్ రిలీజ్
X

సీతారామం లో రష్మిక పాత్రని హిజాబ్ ధరించిన లుక్ తో ఆమె పుట్టినరోజు కానుకగా గతంలో పరిచయం చేశారు. శ్రీరామ నవమి రోజున విడుదల చేసిన గింప్స్ లో యుద్ధంలో రామ్, సీత విజయం సాధించేలా అఫ్రీన్ గా రష్మిక కోరుకునేలా ఆసక్తికరంగా చూపించారు. ఇప్పుడు బక్రిద్ సందర్భంగా రష్మిక పాత్రకు సంబంధించి మరో పోస్టర్ రిలీజ్ చేశారు.

హిజాబ్ ధరించిన రష్మిక మందన్న ఈద్ ఉల్-అధా శుభాకాంక్షలను తెలియజేస్తున్న ఈ పోస్టర్ ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో అచ్చమైన ముస్లిం యువతిగా కనిపిస్తోంది రష్మిక. ఈ చిత్రంలో రష్మిక కాశ్మీరీ ముస్లిం అమ్మాయి అఫ్రీన్ గా కనిపించనుంది.

దుల్కర్ సల్మాన్ రామ్ గా, మృణాల్ ఠాకూర్ సీతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కీలక పాత్ర పోషిస్తుండగా, అతని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా తాజాగా విడుదలైంది. పోస్టర్‌లో సుమంత్ లుక్స్ కు విశేష స్పందన వచ్చింది.

1965 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తోంది. ఈ క్లాసిక్ రొమాంటిక్ కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది సీతారామం.

First Published:  10 July 2022 10:49 PM GMT
Next Story