Telugu Global
National

పైథాగరస్, గురుత్వాకర్షణ సిద్దాంతాలకు రుజువులు లేవట..అయితే అవి వేదాల్లో మాత్రం ఉన్నాయట

బీజేపీ అధికారంలోకి వచ్చిననాటి నుండి విద్యావ్యవస్థను సమూలంగా మార్చాలనే ప్రయత్నాల్లో ఉంది. ప్రతీదీ వేదాల్లోనే ఉంది అని ప్రచారం చేసే హిందుత్వ విద్యను ప్రచారం చేయాలని తహతహలాడటమే కాదు అందుకు అనుగుణంగా చర్యలు కూడా చేపట్టింది బీజేపీ ప్రభుత్వం. పాఠశాల విద్యార్థులందరికీ సంస్కృతాన్ని తృతీయ భాషగా బోధించాలని, సిలబస్ లో మనుస్మృతి, ప్రాచీన సంఖ్యా విధానాలైన భూత సంఖ్య, కటపయాది సంఖ్య పద్ధతులు ప్రవేశ‌పెట్టాలని ప్రతిపాదించిన కర్నాటక ఇప్పుడు మరో వివాదాస్పద ప్రతిపాదనకు తెరలేపింది. విద్యా విధాన‍లో […]

పైథాగరస్, గురుత్వాకర్షణ సిద్దాంతాలకు రుజువులు లేవట..అయితే అవి వేదాల్లో మాత్రం ఉన్నాయట
X
బీజేపీ అధికారంలోకి వచ్చిననాటి నుండి విద్యావ్యవస్థను సమూలంగా మార్చాలనే ప్రయత్నాల్లో ఉంది. ప్రతీదీ వేదాల్లోనే ఉంది అని ప్రచారం చేసే హిందుత్వ విద్యను ప్రచారం చేయాలని తహతహలాడటమే కాదు అందుకు అనుగుణంగా చర్యలు కూడా చేపట్టింది బీజేపీ ప్రభుత్వం.
పాఠశాల విద్యార్థులందరికీ సంస్కృతాన్ని తృతీయ భాషగా బోధించాలని, సిలబస్ లో మనుస్మృతి, ప్రాచీన సంఖ్యా విధానాలైన భూత సంఖ్య, కటపయాది సంఖ్య పద్ధతులు ప్రవేశ‌పెట్టాలని ప్రతిపాదించిన కర్నాటక ఇప్పుడు మరో వివాదాస్పద ప్రతిపాదనకు తెరలేపింది.
విద్యా విధానలో మార్పులపై అధ్యయనం చేయడానికి కర్నాటక ప్రభుత్వం ప్రాథమిక,మాధ్యమిక విద్యా శాఖ రిటైర్డ్ IAS అధికారి మదన్ గోపాల్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్( NCERT) కి సమర్పించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) పొజిషన్ పేపర్లో అనేక వివాదాస్పదమైన విషయాలు ప్రతిపాదించింది.
ఇప్పటికే రుజువైన పైథాగరస్ సిద్దాంతాన్ని, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని ప్రశ్నించింది ఆ కమిటీ. ప్రతి ఒక్క విద్యార్థి దానిని ప్రశ్నించాలని, ప్రశ్నించకుండా దేనినీ అంగీకరించకూడదని ఆ టాస్క్ ఫోర్స్ పేర్కొంది. పైగా న్యూటన్ తలపై ఆపిల్ పడటం లాంటివి నకిలీ ప్రచారాలని పేర్కొంది.
“పైథాగరస్ సిద్ధాంతం శాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ అయిన‌ సిద్ధాంతం కాదు. అన్ని అంతర్జాతీయ వేదికలలో అనేక సిద్ధాంతాలు చర్చనీయాంశమయ్యాయి. చర్చ శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడంలో భాగం” అని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ మదన్ గోపాల్ అన్నారు.
అంతే కాదు ఈ సిద్దాంతాలన్నింటికీ భారతదేశంలోని వేద గ్రంథాలలో మూలాలు ఉన్నాయని చెప్పారాయన.
“నా అభిప్రాయం ప్రకారం గుడ్డిగా అంగీకరించడం కరెక్ట్ కాదు. చర్చలు జరగనివ్వండి. దేనికైనా శాస్త్రీయ ఆధారాలు, పురావస్తు ఆధారాలు ఉండాల్సిందే” అన్నారు గోపాల్.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు సలహాలు, మార్గనిర్దేశం చేసేందుకు అక్టోబర్ 2021లో ఇంప్లిమెంటేషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది.
“ఇందులో 26 కమిటీలు ఏర్పడ్డాయి. ప్రతి పేపర్‌కు 5-6 మంది ప్రముఖ విద్యావేత్తలతో పాటు ఒక ఛైర్మన్ ఉన్నారు.ఇందులో అద్భుత‌ పరిజ్ఞానం ఉన్నవాళ్ళున్నారు” అని గోపాల్ చెప్పారు.
“ఈ బృందాలు దాదాపు ఐదు నెలల పాటు పరస్పరం చర్చించాయి. ఇందులో చాలా మంది క్షేత్ర పర్యటనలు కూడా చేశారు. తర్వాత వారు జిల్లా స్థాయి సంప్రదింపులు కూడా జరిపారు. దాని ఆధారంగా ఈ పత్రాలు తయారు చేయబడ్డాయి” అని గోపాల్ చెప్పారు.
ఇదంతా బాగానే ఉంది కానీ పైథాగరస్ సిద్దాంతం, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతాలకు సరి అయిన శాస్త్రీయ రుజువులు లేవని చెప్తున్న టాస్క్ ఫోర్స్ చైర్మెన్ గోపాల్ అవన్నీ వేదాల్లో ఉన్నాయని చెప్పడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?
First Published:  10 July 2022 9:07 PM GMT
Next Story