Telugu Global
MOVIE UPDATES

కిరణ్ అబ్బవరం మార్క్ తో మరో టీజర్ వచ్చేసింది

కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే టైటిల్ పెట్టారు. ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి హిట్ తర్వాత.. హీరో అబ్బవరం, దర్శకుడు శ్రీధర్ గాదె కాంబోలో వస్తున్న సినిమా ఇది. పూర్తిగా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. కోడి రామకృష్ణ గారి సొంతూరు పాలకొల్లులోని మారుతీ […]

కిరణ్ అబ్బవరం మార్క్ తో మరో టీజర్ వచ్చేసింది
X

కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే టైటిల్ పెట్టారు. ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి హిట్ తర్వాత.. హీరో అబ్బవరం, దర్శకుడు శ్రీధర్ గాదె కాంబోలో వస్తున్న సినిమా ఇది.

పూర్తిగా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. కోడి రామకృష్ణ గారి సొంతూరు పాలకొల్లులోని మారుతీ టాకీస్ లో ఈ టీజర్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. హీరో హీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీజర్ విషయానికొస్తే.. ఎప్పట్లానే కిరణ్ అబ్బవరం తన చిత్తూరు యాసలో డైలాగులు బాగా చెప్పాడు. "యావరేజ్ గా ఉన్న అమ్మాయిల విలువ.. నాలాంటి కరువులో ఉన్న వాళ్లకు తెలుస్తుంది కానీ..నీలాంటి కడుపు నిండిన వాళ్లకు ఏం తెలుస్తుంది మామ.." అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్, టీజర్ లో హైలెట్ గా నిలిచింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా "నేను మీకు బాగా కావాల్సినవాడిని" సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

First Published:  10 July 2022 11:23 PM GMT
Next Story