Telugu Global
NEWS

ఓపెన్ ఛాలెంజ్ ! ఇక తగ్గేదేలే ! కమాన్ !

అదే ఆత్మవిశ్వాసం ! అదే దృఢ సంకల్పం.. చెక్కుచెదరని మనో బలం ! ఇన్నాళ్లూ జస్ట్ చూసీ చూడనట్టు వ్యవహరించినా ఇక ఆ ట్రెండ్ కి స్వస్తి.. కమాన్ ! మీరొక డేట్ చెప్పండి ! అసెంబ్లీని రద్దు చేస్తా! ముందస్తు ఎన్నికలకు వెళ్దాం.. మీరో, మేమో తేల్చుకుందాం.. ఇదీ తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్.. తాజాగా బీజేపీకి విసిరిన సవాల్.. ఇక తగ్గేదేలేదంటున్న ఆయన ఓపెన్ సవాల్ కమలనాథులకు బ్రహ్మాస్త్రమే ! ఇప్పటివరకు ఆయన […]

KCR Challange
X

అదే ఆత్మవిశ్వాసం ! అదే దృఢ సంకల్పం.. చెక్కుచెదరని మనో బలం ! ఇన్నాళ్లూ జస్ట్ చూసీ చూడనట్టు వ్యవహరించినా ఇక ఆ ట్రెండ్ కి స్వస్తి.. కమాన్ ! మీరొక డేట్ చెప్పండి ! అసెంబ్లీని రద్దు చేస్తా! ముందస్తు ఎన్నికలకు వెళ్దాం.. మీరో, మేమో తేల్చుకుందాం.. ఇదీ తెలంగాణ సీఎం, తెరాస అధినేత కేసీఆర్.. తాజాగా బీజేపీకి విసిరిన సవాల్.. ఇక తగ్గేదేలేదంటున్న ఆయన ఓపెన్ సవాల్ కమలనాథులకు బ్రహ్మాస్త్రమే ! ఇప్పటివరకు ఆయన ఈ లెవల్లో మాట్లాడిన సందర్భం లేదు.

కానీ ఏకంగా ప్రధాని మోడీపైనే విమర్శనాస్త్రాలు గతంకన్నా తీవ్రంగా ఎక్కుపెట్టి తెలంగాణ రాజకీయాలను ఒక ఊపు ఊపారు. నా తడాఖా చూడండని గర్జించారు. కమలానికి సింహ స్వప్నమయ్యారు. నేనొక అగ్నికణం.. నన్నెవరూ తాకలేరన్నట్టు చెలరేగిపోయారు. ఎన్నికలకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని, ఇక మీదే ఆలస్యమని కేసీఆర్ అన్నారంటే ఇక బీజేపీ ప్యాంట్లు చిరిగిపోవలసిందే.

బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు ఎవరూ ఇంతటి సవాలును కేంద్రానికి విసరలేదు. మోడీని ఇంతటి స్థాయిలో ఢీ కొట్టలేదు. నువ్వో, నేనో తేల్చుకుందామనుకున్నట్టు ఛాలెంజ్ అంటే ఇదీ అని పొలిటికల్ టచ్ ఇచ్చుకోలేదు. కేసిఆర్ ఇంతటి ప్రకటన చేయడం వెనుక తెలంగాణలో తెరాస శ్రేణులన్నీ తన వెనుక బలంగా ఉన్నాయన్న దృఢ విశ్వాసమే ! ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా తన పార్టీ విజయం, బీజేపీ పరాజయం తథ్యమన్న బలమైన నమ్మకం ఆయనను ముందుండి నడిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీలను ఏనాడో మర్చిపోయిన ఆయన ఇక టీఆర్‌ఎస్ కి ప్రత్యర్థి బీజేపీయే అని భావిస్తున్నారు. షిండేలు, కట్టప్పలు మా ముందు బలాదూర్ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.

మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణాలో పని చేయవని, ఎవరెవరి బలాబలాలు ఎలా ఉంటాయో చూద్దాం.. రండని కేసీఆర్ విసిరిన సవాలుకు బీజేపీ దీటుగా సమాధానమివ్వలేకపోయింది. రాష్ట్రంలో ఇక తెలంగాణ రాజ్యాంగం రావాలన్న కేసీఆర్ నిజంగా సరికొత్త రాజ్యాంగ సృష్టికర్త అయినా ఆశ్చర్యపోనక్కరలేదని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ స్థానే తెలంగాణ ప్రభుత్వం వంటి ప్రభుత్వం రావాలని, అప్పుడది మోడీ అన్నట్టు డబుల్ ఇంజన్ ప్రభుత్వమవుతుందని ఆయన సెటైర్ వేశారు.

దేశంలో మార్పు రావాలి. బ్యాంకుల్ని దోచుకున్న దొంగలను విదేశాలనుంచి దేశానికి రప్పించలేకపోయిన బీజేపీ కూడా ఓ దొంగేనన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యతోనైనా మోడీ ప్రభుత్వం నీరవ్ మోడీలను, విజయ్ మాల్యాలను దేశానికి రప్పిస్తుందా ? స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని తెప్పిస్తుందా ? నిన్నటికి నిన్న లడఖ్ సరిహద్దుల మీద తిరిగిన చైనా విమానాలను అడ్డుకోలేకపోతున్న మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది ? కేసీఆర్ హుంకరింపులకు బీజేపీ శ్రేణులు బేర్ మంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ప్రగతి భవన్ నిన్న ఆయన గర్జనలతో హోరెత్తిపోయింది. చివరకు లుంగీ కట్టుకున్న ఓ పెద్దాయన ఇక్కడికొచ్చి ఏం ఒరగబెట్టారని పరోక్షంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని ఉద్దేశించి కూడా కేసీఆర్ కసిగా వ్యాఖ్యానించారు. దేశానికి ఓ మార్పు కావాలని, అవసరమైతే టీఆర్‌ఎస్ జాతీయ పార్టీ అవుతుందని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వెనుకాడదని ఆయన చెప్పారంటే ఇక ఇందుకు అన్ని హంగులూ రెడీ చేసుకున్నట్టే భావించాల్సి వస్తుంది.

పనిలో పనిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తనకు ఫ్రెండ్ అని, ఆయన సలహాలు తీసుకుంటే తప్పేమిటన్నట్టు మాట్లాడారు. ఇదొక యుద్ధ తంత్రం ! మేం ఎంత దూరమైనా పోతాం.. గజదొంగలను విడిచిపెట్టేది లేదు అని ఆయన గర్జించారు. సి.ఎం. రమేష్, సుజనా చౌదరి వంటివారికి ఈడీ దాడుల భయం పెట్టి మోడీ ప్రభుత్వం తనవైపు తిప్పుకుందని, కానీ ఇక్కడ అలాంటి పప్పులుడకవని హెచ్చరించారు.

బీజేపీకి చెందిన ఓ మహిళ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆమెను తీవ్రంగా మందలిస్తే.. ఆ న్యాయమూర్తులనే కొందరు మాజీ జడ్జీలు, మాజీ బ్యూరోక్రాట్లు తప్పు పట్టడమేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్దీవాలా కు తన సెల్యూట్ అని ఓపెన్ గా వారిని అభినందించారు. ఈ న్యాయమూర్తులను విమర్శిస్తూ మాజీలు కొందరు చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తముందని కేసీఆర్ ఆరోపించారు.

నిజంగా ఇది అక్షర సత్యమే.. నూపుర్ శర్మ అనే బీజేపీ మాజీ నేత చేసిన వ్యాఖ్యతో దేశంలోనే గాక, విదేశాల్లో కూడా అగ్గి రాజుకుంది. చివరకు మలేషియా, ఇండోనేషియాలలోని హ్యాకర్ గ్రూపులు నిర్భయంగా దేశంలోని కీలకమైన వెబ్ సైట్లలోనే చొరబడ్డాయి. నుపుర్ తో పాటు అనేకమంది వ్యక్తిగత వివరాలను సైతం ఇవి బహిరంగపరిచాయి. అస్సోంలోని ఓ న్యూస్ ఛానల్ లో పాకిస్తాన్ జాతీయ పతాకం చెటుక్కున కనబడిందంటే ఏమనుకోవాలి ? దేశంలో ఇన్ని జరుగుతున్నా కిమ్మనని బీజేపీ సర్కార్ మీద కేసీఆర్ నిప్పులు చెరిగారంటే అందులో ఆశ్చర్యం లేదు.

శాంతి భద్రతలతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో బీజేపీ వీటిని భంగపరిచే యత్నాలు చేస్తే తాము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ కి వాళ్ళు జాతీయ కార్యవర్గ సమావేశాలంటూ వచ్చి ఏం ఒరగబెట్టారని, తానడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు.

First Published:  10 July 2022 8:47 PM GMT
Next Story