Telugu Global
MOVIE UPDATES

నితిన్ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు.. అమ్మ రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు..!

ప్రముఖ సినీ హీరో నితిన్ పై దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నితిన్ తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లో అమ్మరాజశేఖర్ దర్శకత్వం వహించిన హైఫై చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడికి నితిన్ అతిథిగా రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. కాగా ఈ విషయంపై దర్శకుడు అమ్మ రాజశేఖర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. స్టేజీ మీదే అమ్మ రాజశేఖర్ నితిన్ […]

నితిన్ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు.. అమ్మ రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు..!
X

ప్రముఖ సినీ హీరో నితిన్ పై దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నితిన్ తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లో అమ్మరాజశేఖర్ దర్శకత్వం వహించిన హైఫై చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఇక్కడికి నితిన్ అతిథిగా రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. కాగా ఈ విషయంపై దర్శకుడు అమ్మ రాజశేఖర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. స్టేజీ మీదే అమ్మ రాజశేఖర్ నితిన్ ను విమర్శించారు.

‘మా సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్‌కు వస్తానని నితిన్ మాట ఇచ్చాడు. కానీ ఇక్కడకు రాకుండా నన్ను మోసం చేశాడు. నితిన్ కు మొదట్లో డ్యాన్స్ వచ్చేది కాదు. నేనే అతడికి డ్యాన్స్ నేర్పించాను. అయినా నన్ను అవమానించాడు. అసలు ఈవెంట్ కు రాలేనని ముందే చెప్పాల్సింది. కానీ వస్తానని మాట ఇచ్చాడు.

అతడి కోసం ప్రత్యేకంగా ఓ ఏవీని కూడా సిద్ధం చేశాను. కానీ నితిన్ ఇక్కడికి రాకుండా నన్ను మోసం చేశాడు. కనీసం వీడియో బైట్ అయినా పంపించాలని వేడుకున్నాను. కానీ అది కూడా పంపలేదు. ఇంతలా నమ్మించి మోసం చేస్తాడని ఊహించలేదు’ అంటూ అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. కాగా గతంలో నితిన్ హీరోగా నటించిన టక్కరి చిత్రానికి అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు.

First Published:  11 July 2022 7:23 AM GMT
Next Story