Telugu Global
NEWS

వైసీపీ అంటరాని పార్టీనే, మేం మద్దతు కోరలేదు

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విషయంలో వైసీపీ సంయమనం, సానుకూలత ప్రదర్శిస్తున్నప్పటికీ అటువైపు నుంచి మాత్రం అదే తరహా స్పందన ఉండడం లేదు. వైసీపీని అవహేళన చేసేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వైసీపీని చులకన చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అసలు రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతును తాము కోరలేదని ఆయన ప్రకటించారు. తమ పార్టీ జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా వైసీపీని కోరలేదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రుల […]

వైసీపీ అంటరాని పార్టీనే, మేం మద్దతు కోరలేదు
X

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విషయంలో వైసీపీ సంయమనం, సానుకూలత ప్రదర్శిస్తున్నప్పటికీ అటువైపు నుంచి మాత్రం అదే తరహా స్పందన ఉండడం లేదు. వైసీపీని అవహేళన చేసేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వైసీపీని చులకన చేస్తూ వ్యాఖ్యలు చేశారు.

అసలు రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతును తాము కోరలేదని ఆయన ప్రకటించారు. తమ పార్టీ జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా వైసీపీని కోరలేదని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రుల వెనుక ఎక్కడో నిల్చోని ఫోటోలకు కనిపిస్తూ.. తాము బీజేపీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నామన్న భ్రమను ప్రజల్లో కలిగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇదో రకమైన మైండ్ గేమ్ అని సత్యకుమార్ ఆరోపించారు. సీఏఏ, వ్యవసాయ బిల్లుల విషయంలో పార్లమెంట్‌లో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వైసీపీ.. ఆ తరువాత ఆ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా మద్దతు ఇచ్చిందన్నారు.

ఢిల్లీలో తమ తోక పార్టీగా వ్యవహరిస్తూ ఇక్కడ మరోలా మాట్లాడుతున్న వైసీపీ నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ఏ రకంగా చూసినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అంటరాని పార్టీనే అవుతుందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.

బీజేపీ వైసీపీ మధ్య ఎలాంటి సయోధ్య, ఒప్పందాలు లేవని అలా ఉందని ఎవరైనా భావిస్తుంటే ఆ అపోహలను, అభిప్రాయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ నాయకుడుపైనా ఉంటుందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సత్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి భార్య స్వయంగా ఒక మీడియా సంస్థను నడుపుతున్నారని, అలాంటప్పుడు పార్టీ ప్లీనరీలో ఇతర మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి విమర్శలు చేయడం ఏంటని సత్యకుమార్ ప్రశ్నించారు. అభివృద్ధి అన్నది జగన్ డిక్షనరీలోనే లేదని సత్య కుమార్‌ విమర్శించారు.

First Published:  10 July 2022 9:20 PM GMT
Next Story