Telugu Global
MOVIE UPDATES

మరో 4 రోజుల్లో ఏజెంట్ టీజర్

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెడుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఏజెంట్ టీజర్, మరో 4 రోజుల్లో, జులై 15న విడుదల కానుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యాడు. స్టయిలిష్‌గా చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్సులు ‘ఏజెంట్’కి ప్రత్యేక ఆకర్షణగా […]

మరో 4 రోజుల్లో ఏజెంట్ టీజర్
X

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్‘ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెడుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఏజెంట్ టీజర్, మరో 4 రోజుల్లో, జులై 15న విడుదల కానుంది.

స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యాడు. స్టయిలిష్‌గా చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్సులు ‘ఏజెంట్’కి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేశారు.

ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించాడు.

ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  10 July 2022 11:03 PM GMT
Next Story