Telugu Global
National

కర్ణాటకలో ఆర్ఎస్ఎస్‌ చింతన్ శిబిర్.. మళ్ళీ పట్టు కోసం !

కర్ణాటకలో రెండు రోజుల పాటు ఆర్ఎస్ఎస్‌ చింతన్ శిబిర్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాల అజెండా వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే .. రాష్ట్రంలో తిరిగి బీజేపీ సాధించగల విజయావకాశాల పైనే ఈ శిబిర్ ఫోకస్ .. అయితే ఈ చింతన్ శిబిర్ పై ఆర్ఎస్ఎస్‌ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళినీ కుమార్ కటీల్, […]

కర్ణాటకలో ఆర్ఎస్ఎస్‌ చింతన్ శిబిర్.. మళ్ళీ పట్టు కోసం !
X

కర్ణాటకలో రెండు రోజుల పాటు ఆర్ఎస్ఎస్‌ చింతన్ శిబిర్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాల అజెండా వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే .. రాష్ట్రంలో తిరిగి బీజేపీ సాధించగల విజయావకాశాల పైనే ఈ శిబిర్ ఫోకస్ .. అయితే ఈ చింతన్ శిబిర్ పై ఆర్ఎస్ఎస్‌ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళినీ కుమార్ కటీల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ కర్ణాటక ఇన్-ఛార్జ్ అరుణ్ సింగ్ తో పాటు కొందరు ఆర్ఎస్ఎస్‌ నేతలు కూడా వీటిలో పాల్గొనే సూచనలున్నాయి.

హిజాబ్, హలాల్ వంటి కీలక సమస్యలపై బొమ్మై ప్రభుత్వం వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో తిరిగి అధికార పగ్గాలను చేప‌ట్టగలుగుతామా అని ఆర్ఎస్ఎస్‌ కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య చేస్తున్న విమర్శలకు బీజేపీ నేతలు దీటైన సమాధానమివ్వలేకపోతున్నారని ఆర్ఎస్ఎస్‌ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలను ఈ చింతన్ శిబిర్ సమావేశాల్లో చర్చిస్తారని భావిస్తున్నారు.

రాష్ట్రంలో మళ్ళీ బీజేపీ విజయం సాధించడానికి ప్రభుత్వం, పార్టీ, నేతలు, ఆర్ఎస్ఎస్ చేప‌ట్టగల కీలక పాత్ర ప్రధాన చర్చనీయాంశంగా ఉండవచ్చు. ఇటీవల పాఠ్య పుస్తకాల రివిజన్ పై పై రోహిత్ చక్రతీర్థ కమిటీ చేసిన సూచనలు కూడా ఈ సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్‌ పై ప్రముఖ రైటర్ దేవనూర్ మహాదేవ్ తన ఇటీవలి పుస్తకంలో కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించడానికి పార్టీ కార్యకర్తలు ఏం చేయాలన్నదానిపై ఈ సమావేశాలు సూచనలు ఇవ్వవచ్చని తెలుస్తోంది. గత జూన్ 30 న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళినీ కుమార్ కటీల్.. బెంగళూరులోని ఆర్ఎస్ఎస్‌ కార్యాలయంలో ఈ సంస్థ నేతలు ముకుంద్ తోను, మరికొంత మందితోను చర్చలు జరిపారు. దాదాపు 45 నిముషాల పాటు ఈ చర్చలు జరిగాయి.

ఇలా ఉండగా దేశంలో ఆర్ఎస్ఎస్‌ తన శాఖలను మరింత విస్తరించనుంది. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో తమ శాఖలను బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇందుకు 2024 ఎన్నికలేనన్నది బహిరంగ రహస్యం. అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది.

First Published:  10 July 2022 1:41 AM GMT
Next Story