Telugu Global
MOVIE UPDATES

దిల్ రాజు కోరిక మేరకు కార్తికేయ-2 వాయిదా

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ-2. నాగచైతన్య హీరోగా నటించిన సినిమా థాంక్యూ. లెక్కప్రకారం ఈ రెండు సినిమాలు జులై 22కు విడుదల కావాలి. రెండు సినిమాల ప్రమోషన్ జోరుగా సాగుతోంది. కానీ ఉన్నట్టుండి సడెన్ గా కార్తికేయ-2 సినిమా రేసు నుంచి తప్పుకుంది. నిజానికి థాంక్యూ సినిమాతో పోలిస్తే, కార్తికేయ-2 సినిమాపైనే ఎక్కువగా అంచనాలున్నాయి. నిఖిల్ సినిమానే ప్రమోషన్ తో ఎక్కువగా అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ విషయంలో థాంక్యూ సినిమా వెనకబడింది. నాగచైతన్య సినిమాకు బొత్తిగా […]

దిల్ రాజు కోరిక మేరకు కార్తికేయ-2 వాయిదా
X

నిఖిల్ హీరోగా నటించిన సినిమా కార్తికేయ-2. నాగచైతన్య హీరోగా నటించిన సినిమా థాంక్యూ. లెక్కప్రకారం ఈ రెండు సినిమాలు జులై 22కు విడుదల కావాలి. రెండు సినిమాల ప్రమోషన్ జోరుగా సాగుతోంది. కానీ ఉన్నట్టుండి సడెన్ గా కార్తికేయ-2 సినిమా రేసు నుంచి తప్పుకుంది.

నిజానికి థాంక్యూ సినిమాతో పోలిస్తే, కార్తికేయ-2 సినిమాపైనే ఎక్కువగా అంచనాలున్నాయి. నిఖిల్ సినిమానే ప్రమోషన్ తో ఎక్కువగా అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ విషయంలో థాంక్యూ సినిమా వెనకబడింది. నాగచైతన్య సినిమాకు బొత్తిగా క్రేజ్ రాకపోవడంతో దిల్ రాజు రంగంలోకి దిగాడు.

థాంక్యూ సినిమాను స్వయంగా నిర్మించడంతో పాటు, ప్రచారాన్ని కూడా దగ్గరుండి చూసుకుంటున్న దిల్ రాజు.. కార్తికేయ-2 యూనిట్ తో సంప్రదింపులు జరిపారు. చైతూ సినిమాకు సోలో రిలీజ్ కావాలంటూ కోరారు. దీంతో కార్తికేయ-2 వెనక్కి తగ్గింది.

పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన కార్తికేయ-2 సినిమా ప్రమోషన్స్ తగ్గించారు. ఈ సినిమాను జులై 22న కాకుండా, ఆగస్ట్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు.

కార్తికేయ-2 సినిమాకు వినూత్నంగా ప్రచారం కల్పిస్తున్నారు. రిలీజ్ లోపు కనీసం 3 ట్రయిలర్స్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రయిలర్-1ను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడంతో.. ట్రయిలర్స్ సంఖ్యను పెంచాలనుకుంటున్నారు. నిఖిల్, అనుపమ పరమేశ్వర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు.

First Published:  10 July 2022 5:01 AM GMT
Next Story