Telugu Global
National

శ్రీలంకలా మారేందుకు సిద్ధంగా ఉన్న భారత్..

భారత దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ దారుణంగా పడిపోతోంది. ఫలితంగా విదేశీ అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది. మరో ఏడాదిపాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ లో కూడా శ్రీలంక లాంటి పరిస్థితులు దాపురించే ప్రమాదముందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటన్నిటి ఫలితంగానే ఇప్పుడు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గోధుమపిండి ధర పెరుగుతోందని ఎగుమతులు ఆపేశారు, కానీ ఫలితం లేదు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు […]

indian rupee
X

భారత దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారక విలువ దారుణంగా పడిపోతోంది. ఫలితంగా విదేశీ అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది. మరో ఏడాదిపాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ లో కూడా శ్రీలంక లాంటి పరిస్థితులు దాపురించే ప్రమాదముందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటన్నిటి ఫలితంగానే ఇప్పుడు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

గోధుమపిండి ధర పెరుగుతోందని ఎగుమతులు ఆపేశారు, కానీ ఫలితం లేదు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర కాస్త పెరిగినా ఆ సాకు చూపి ఇక్కడ గ్యాస్ సిలిండర్లపై మోతమోగించేస్తున్నారు.

క్రమక్రమంగా భారం అలవాటవుతుంది కానీ, ఎనిమిదేళ్ల ముందున్న పరిస్థితులకు ఇప్పటికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే భారత్ కూడా శ్రీలంకలా అలమటించకమానదు.

ప్రస్తుతం భారత దేశ అప్పు 621 బిలియన్ డాలర్లుగా ఉంది. అందులో 43 శాతం, అంటే 267 బిలియన్ డాలర్లు వచ్చే 9 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం భారత విదేశీ మారక నిల్వల్లో 44 శాతం ఉంటుంది. అంటే కచ్చితంగా తీర్చాల్సిన ఆ అప్పుగనక ఇవ్వాల్సి వస్తే విదేశీ మారక నిల్వలు సగానికి సగం కోసుకుపోతాయి. శ్రీలంక కూడా ఇలాంటి పరిస్థితిని అనుభవించి ఆ తర్వాత పూర్తిగా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయింది.

గత ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక రుణాలు 8 శాతం పెరగగా, స్వల్ప కాలిక రుణాలు ఏకంగా 20శాతం పెరిగాయి. మరోవైపు జీడీపీ అంతకంతకూ పడిపోతోంది. మొత్తంగా చూస్తే దేశ ఆర్థిక పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది.

ఎన్డీఏ హయాంలో ఎనిమిదేళ్లలో ఈ దురవస్థ అంతకంతకూ పెరిగింది. ఇప్పుడిక అది తిరిగి అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు నిపుణులు. అందుకే పాలపై కూడా జీఎస్టీ వేసి పిండుకుంటున్నారు, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిలను అటకెక్కించారు, సైన్యంలో పింఛన్లు ఎగ్గొట్టడానికి అగ్నిపథ్ తెచ్చారు, గ్యాస్ సిలిండర్ రేట్లను అంతకంతకూ పెంచుతున్నారు. ఈ పరిణామాలన్నీ చివరకు తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి దారితీయబోతున్నాయి.

First Published:  10 July 2022 8:53 AM GMT
Next Story