Telugu Global
MOVIE UPDATES

క్రేజీ ఫెలో లేటెస్ట్ అప్ డేట్స్

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న సినిమా క్రేజీ ఫెలో. లాంగ్ గ్యాప్ తర్వాత ఆది నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. నిర్మాత కె.కె.రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రేజీ ఫెలో నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘క్రేజీ ఫెలో’గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా […]

క్రేజీ ఫెలో లేటెస్ట్ అప్ డేట్స్
X

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న సినిమా క్రేజీ ఫెలో. లాంగ్ గ్యాప్ తర్వాత ఆది నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. నిర్మాత కె.కె.రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నాడు.

క్రేజీ ఫెలో నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘క్రేజీ ఫెలో’గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆది చేతిలో గులాబీ పువ్వుల గుత్తితో నవ్వుతూ కనిపిస్తుండగా, హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ సీతాకోకచిలుక రెక్కలుగా చెరో వైపు కనిపించడం కలర్ ఫుల్ గా ఉంది.

ఆర్‌ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలకు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్ర ప్రోమోషన్స్ ను దూకుడుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. వరుసగా ఫెయిల్యూర్స్ అందుకుంటున్న ఆది సాయికుమార్, ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు ఈ హీరో.

First Published:  10 July 2022 12:43 AM GMT
Next Story