Telugu Global
MOVIE UPDATES

ఒక్క ట్రయిలర్ తో కోట్లు కొల్లగొడుతోంది

కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా బింబిసార. మొన్నటివరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేవు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత కూడా అంచనాలు అంతంతమాత్రమే పెరిగాయి. అయితే ఎప్పుడైతే సినిమా టీజర్ రిలీజైందో, టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది బింబిసార. ఓవర్ నైట్ లో ఈ సినిమాకు క్రేజ్ పెరగడంతో పాటు భారీగా మార్కెట్ కూడా జరుగుతోంది. ట్రయిలర్ చూసిన దిల్ రాజు, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నాడు. కేవలం […]

ఒక్క ట్రయిలర్ తో కోట్లు కొల్లగొడుతోంది
X

కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా బింబిసార. మొన్నటివరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేవు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత కూడా అంచనాలు అంతంతమాత్రమే పెరిగాయి. అయితే ఎప్పుడైతే సినిమా టీజర్ రిలీజైందో, టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది బింబిసార. ఓవర్ నైట్ లో ఈ సినిమాకు క్రేజ్ పెరగడంతో పాటు భారీగా మార్కెట్ కూడా జరుగుతోంది.

ట్రయిలర్ చూసిన దిల్ రాజు, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకున్నాడు. కేవలం నైజాం మాత్రమే కాదు, ఆంధ్రా ఏరియా రైట్స్ కూడా దిల్ రాజు వశమయ్యాయి. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల్ని 10 కోట్ల రూపాయలకు దిల్ రాజు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. కల్యాణ్ రామ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాకు దక్కిన ఎమౌంట్ చాలా ఎక్కువనే చెప్పాలి.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. త్వరలోనే నాన్-థియేట్రికల్ బిజినెస్ ను కూడా క్లోజ్ చేయబోతున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 15 కోట్ల రూపాయలు ఆశిస్తున్నాడు కల్యాణ్ రామ్. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మార్కెటింగ్ కోసం స్వయంగా ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

బింబిసారలో క్యాథరీన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. పీరియాడిక్ డ్రామాగా, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.

First Published:  10 July 2022 2:30 AM GMT
Next Story