Telugu Global
Health & Life Style

ఆర్థరైటిస్ సమస్యను ఆహారంతో దూరంపెట్టచ్చు!

మనిషికి మానసిక సమస్యలు ఒత్తిడిని పెంచితే శారీరక సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. ఈకాలంలో అనారోగ్యం వల్ల శారీరక సమస్యలు కూడా చాలాశాతం నమోదు అవుతున్నాయి. మనిషి నడకకు అంతరాయం కలిగించే అలాంటి సమస్యే ఆర్థరైటిస్. కీళ్లు అరిగిపోవడాన్నే వైద్యపరిభాషలో ఆర్థరైటిస్ అని పిలుస్తున్నారు. ఇది సహజంగా వయసు పెరుగుదల వల్ల వచ్చే సమస్య. వాడేకొద్ది ఏదైనా ఎలా అరిగిపోతుందో అలాగే కీళ్లు కూడా క్రమంగా అరిగిపోతుంటాయి. మనిషి శరీర భారాన్ని మోసే ముఖ్యమైన అవయవాలు కాళ్ళు. […]

ఆర్థరైటిస్ సమస్యను ఆహారంతో దూరంపెట్టచ్చు!
X

మనిషికి మానసిక సమస్యలు ఒత్తిడిని పెంచితే శారీరక సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. ఈకాలంలో అనారోగ్యం వల్ల శారీరక సమస్యలు కూడా చాలాశాతం నమోదు అవుతున్నాయి. మనిషి నడకకు అంతరాయం కలిగించే అలాంటి సమస్యే ఆర్థరైటిస్. కీళ్లు అరిగిపోవడాన్నే వైద్యపరిభాషలో ఆర్థరైటిస్ అని పిలుస్తున్నారు. ఇది సహజంగా వయసు పెరుగుదల వల్ల వచ్చే సమస్య. వాడేకొద్ది ఏదైనా ఎలా అరిగిపోతుందో అలాగే కీళ్లు కూడా క్రమంగా అరిగిపోతుంటాయి.

మనిషి శరీర భారాన్ని మోసే ముఖ్యమైన అవయవాలు కాళ్ళు. శరీరం బరువు అంతా మోకాళ్ళ మీదనే పడుతుంది. అందుకే వయసు పెరిగేకొద్దీ ఆ మోకాళ్ళ కీళ్లు అరిగిపోయి అక్కడ పుట్టే మంట ఆర్థరైటిస్ సమస్యగా మారిపోతుంది. ఇది నడవనీదు, కూర్చోనీదు, కూర్చున్నవాళ్లను లేవనీదు, లేచిన వాళ్ళను కూర్చోనీదు. అందరికీ కేవలం మోకాళ్ళ సమస్యలా అనిపించినా అనుభవించేవాళ్లకు నరకంలానే ఉంటుంది. అయితే తీసుకునే ఆహారం మీద దృష్టిపెడితే ఈ ఆర్థరైటిస్ ప్రభావాన్ని తగ్గించవచ్చని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు.

◆ కీళ్ల మధ్య మంటను కలిగించే ఆహారాలను మానేయాలి. అలాగే మంటకు ఉపశమనాన్ని కలిగించే ఆహారపదార్థాలు తీసుకోవాలి. అధికంగా కొవ్వు కలిగిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, తృణధాన్యాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి కాబట్టి వాటిని ఆహారంలో బాగం చేసుకోవాలి.

◆ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంటను తగ్గించడంలో సహాయపడతాయి. చేపలలో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

◆బఠానీలు, బీన్స్ కండరాల ఆరోగ్యానికి సహాయపడే కూరగాయలలో ప్రథమస్థానంలో ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటూ కొవ్వులను అసలు కలిగిఉండవు. అందుకే ఇవి మంచి యాంటీఆక్సిడెంట్లను శరీరానికి అందిస్తాయి.

◆ వాల్ నట్స్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇవి ఆర్థరైటిస్ సమస్యకు చక్కని పరిష్కారంలా కనిపిస్తాయి. అయితే వీటిలో కొవ్వు మూలాలు కొంచెం ఎక్కువగానే ఉండటం వల్ల ఎక్కువగా తినకూడదు బరువు పెంచేస్తాయి.

◆ రోజువారీ వంటలలో ఉపయోగించే నూనెలకు బదులు ఆలివ్ నూనె వాడటం చాలామంచిది. ఇందులో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వును ఒలియోకాంతల్ అని పిలుస్తారు, ఇది మంటను తగ్గిస్తుంది. అయితే ఎక్కువగా వాడితే అన్ని నూనెల్లానే ఆలివ్ ఆయిల్ కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.

◆ శరీరానికి పోషకాలను అందించే అన్నిరకాల ఆహారపదార్థాలు తీసుకోవాలి. రుచికోసం ఏ ఒక్కదానికో, కొన్నింటికో పరిమితం కాకూడదు.

◆ రోజులో తినే ఆహారపదార్థాన్ని చేసే పనిని గమనించుకోవాలి. తిండికి తగిన కష్టం లేకపోతే శరీరం వేగంగా కొండలా పెరిగిపోతుంది. ఎత్తుకుతగ్గ బరువు ఉంటే చాలావరకు ఆర్థరైటిస్ సమస్య దూరంగా ఉంటుంది. అంటే అధికబరువు ఆర్థరైటిస్ సమస్యను తొందరగా తెచ్చిపెడుతుందనమాట.

◆ ధాన్యం ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు ఆహారంలో తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులన్నీ సహజంగా లభించే మాంసం, డ్రైఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులలో ఉంటాయి కాబట్టి అవి తీసుకోవాలి. బేక్ చేసినవి, నూనెలో ఎక్కువ వేయించినవి, నిల్వ ఉంచినవి చెడ్డ కొవ్వులు కలిగిఉంటాయి. వాటికి దూరంగా ఉండాలి.

◆ ఆహారంలో చెక్కెరను వీలైనంత తగ్గించుకోవాలి. పీచుపదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మధ్యపానం అలవాటు ఉంటే దానికి వీడ్కోలు చెప్పాలి.

◆ కాల్షియం, విటమిన్-డి ఉన్న ఆహారాలు తీసుకోవడం మాత్రమే కాకుండా విటమిన్ సి, బి6, బి12, విటమిన్-ఇ, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం శరీరానికి సరైనమోతాదులో అందేలా జాగ్రత్తపడాలి.

First Published:  10 July 2022 12:25 AM GMT
Next Story