Telugu Global
NEWS

బాబుకు పిచ్చిపట్టింది.. ప్లీనరీ అంటే పార్టీ మీటింగ్.. బహిరంగ సభ కాదు: విజయసాయి

వైసీపీ ప్లీనరీ అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు ముఖ్యమంత్రి జగన్, విజయమ్మ, పలువురు మంత్రులు కూడా పాల్గొని ప్రసంగించారు. రెండో రోజైన నేడు ముఖ్యమంత్రి జగన్ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్లీనరీ మీటింగ్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అసలు ఏం సాధించారని ప్లీనరీ పెట్టారని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్లీనరీకి జనం రాలేదని మరికొందరు నేతలు ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. […]

MP Vijayasai
X

వైసీపీ ప్లీనరీ అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. తొలిరోజు ముఖ్యమంత్రి జగన్, విజయమ్మ, పలువురు మంత్రులు కూడా పాల్గొని ప్రసంగించారు. రెండో రోజైన నేడు ముఖ్యమంత్రి జగన్ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.

ఇదిలా ఉంటే ప్లీనరీ మీటింగ్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అసలు ఏం సాధించారని ప్లీనరీ పెట్టారని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్లీనరీకి జనం రాలేదని మరికొందరు నేతలు ఆరోపించారు.

కాగా ఈ ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు నాయుడు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనూ పోటీచేసే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో బాబు ఎక్కడ పోటీచేసినా ఓడగొడతాం. 175 స్థానాలకు 175 ఎమ్మెల్యేలు సీట్లు గెలుచుకోవడమే టార్గెట్ గా పనిచేస్తున్నాం. ప్లీనరీ అంటే బహిరంగ సభ కాదు.. కేవలం వైసీపీ ప్రతినిధుల సభ.

శుక్రవారం 1.68లక్షల మంది కార్యకర్తలు ప్లీనరీకి హాజరయ్యారు. ఇవాళ 4.5 లక్షల మందికిపైగా పార్టీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది.’ అని అన్నారు.

వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటని ఆయన విమర్శించారు.

First Published:  9 July 2022 2:24 AM GMT
Next Story