Telugu Global
MOVIE UPDATES

ఆ సినిమాకు పేరు మారింది

కొన్ని సినిమాలు ఓ పేరుతో స్టార్ట్ అవుతాయి. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ ఆ సినిమా పేరు మారిపోతుంది. అలాంటిదే ఇది కూడా ఇషా చావ్లా రీఎంట్రీ ఇస్తోంది. ఓ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. దీనికి అగోచర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఫిలించాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఇప్పుడీ సినిమాకు పేరు మారింది. ల‌వ్లీ వ‌ర‌ల్డ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ ఈ […]

ఆ సినిమాకు పేరు మారింది
X

కొన్ని సినిమాలు ఓ పేరుతో స్టార్ట్ అవుతాయి. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ ఆ సినిమా పేరు మారిపోతుంది. అలాంటిదే ఇది కూడా ఇషా చావ్లా రీఎంట్రీ ఇస్తోంది. ఓ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. దీనికి అగోచర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఫిలించాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఇప్పుడీ సినిమాకు పేరు మారింది.

ల‌వ్లీ వ‌ర‌ల్డ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతోంది ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కబీర్ లాల్ ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. ఇప్పుడీ సినిమాకు అగోచర అనే పేరు మార్చేశారు. దివ్యదృష్టి అనే టైటిల్ పెట్టారు. దానికి ఓ కారణం కూడా ఉంది.

ఈషా చావ్లా ఇందులో లీడ్ రోల్ చేసోంది. త‌న సోద‌రి హ‌త్య‌కు కార‌ణ‌మైన వారిని వెతికి క‌నిపెట్టాల‌నుకునే కంటిచూపులేని అమ్మాయి క‌థే ఈ సినిమా. ఇందులో ఇషా చావ్ల పాత్ర పేరు దివ్య. ఆమెకు కళ్లు కనిపించవు. అయినప్పటికీ ఈ కేసును ఛేదిస్తుంది. అందుకే దీనికి దివ్య దృష్టి అనే టైటిల్ పెట్టారు.

గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ని రూపొందిస్తున్నారు. క‌మ‌ల్ కామ‌రాజు ఈ చిత్రంలో బిజినెస్‌మేన్‌గా న‌టిస్తున్నారు. ఈషా చావ్లా చేస్తున్న దివ్య పాత్రకు భర్తగా క‌నిపిస్తారు క‌మ‌ల్‌. నిళ‌ల్‌గ‌ళ్ ర‌వి, తుల‌సి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిర్మాత అజ‌య్‌కుమార్ సింగ్ ఇందులో పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ రోల్ చేస్తున్నారు. వీళ్లు మాత్ర‌మే కాదు, ఇంకా ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు.

First Published:  9 July 2022 7:12 AM GMT
Next Story