Telugu Global
MOVIE UPDATES

సీతారామం.. సుమంత్ ఫస్ట్ లుక్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, రష్మిక కీలక పాత్రలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుండి మరో బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. […]

సీతారామం.. సుమంత్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, రష్మిక కీలక పాత్రలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుండి మరో బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో సుమంత్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.

ఫస్ట్ లుక్ లో ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు సుమంత్. సాఫ్ట్, క్లాస్ పాత్రలలో కనిపించే సుమంత్ .. బ్రిగేడియర్ విష్ణు శర్మగా టెర్రిఫిక్ లుక్ లో కనిపించాడు. ఆర్మీ దుస్తుల్లో మెలితిరిగిన మీసాలతో సీరియస్ గా చూస్తున్న సుమంత్ మేకోవర్ సరికొత్తగా ఉంది.

ఈ చిత్రంలో సుమంత్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతుంది. ఈ సందర్భంగా వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్. ”కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో వుంటుంది. ముగింపు కాదు. బ్రిగేడియర్ విష్ణు శర్మ… మద్రాస్ రెజిమెంట్” అని సుమంత్ చెప్పిన డైలాగ్ మరింత ఆసక్తికరంగా వుంది.

1965 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 July 2022 5:00 AM GMT
Next Story