Telugu Global
MOVIE UPDATES

ఎన్వీ ప్రసాద్ చేతికి చిక్కిన కోబ్రా

ఓవైపు విక్రమ్ హాస్పిటల్ లో కోలుకుంటుంటే, మరోవైపు అతడు నటించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ప్రయోగాత్మక చిత్రాలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో నటించిన తాజా చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్.. ఆంధ్రప్రదేశ్, […]

ఎన్వీ ప్రసాద్ చేతికి చిక్కిన కోబ్రా
X

ఓవైపు విక్రమ్ హాస్పిటల్ లో కోలుకుంటుంటే, మరోవైపు అతడు నటించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ప్రయోగాత్మక చిత్రాలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరో నటించిన తాజా చిత్రం కోబ్రా. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో గణితశాస్త్ర మేధావిగా కనిపించబోతున్నాడు విక్రమ్. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా, టెక్నికల్ గా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

First Published:  9 July 2022 7:23 AM GMT
Next Story