Telugu Global
MOVIE UPDATES

వచ్చే నెల నుంచి సెట్స్ పైకి మహేష్

మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ గాసిప్స్ మాత్రమే చదువుతూ వచ్చాం. చాన్నాళ్ల తర్వాత నిర్మాణ సంస్థ నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ మేరకు హారిక-హాసిని సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. త్రివిక్రమ్-మహేష్ మధ్య కథాచర్చలు ముగిశాయి. త్రివిక్రమ్ చెప్పిన ఫైనల్ వెర్షన్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ […]

వచ్చే నెల నుంచి సెట్స్ పైకి మహేష్
X

మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ గాసిప్స్ మాత్రమే చదువుతూ వచ్చాం. చాన్నాళ్ల తర్వాత నిర్మాణ సంస్థ నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ మేరకు హారిక-హాసిని సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది.

త్రివిక్రమ్-మహేష్ మధ్య కథాచర్చలు ముగిశాయి. త్రివిక్రమ్ చెప్పిన ఫైనల్ వెర్షన్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిజానికి ఈ నెల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి రావాల్సి ఉంది. అయితే అనుకోకుండా మహేష్ మరోసారి విదేశీ పర్యటన పెట్టుకున్నాడు. దీంతో ఈ నెలలో సెట్స్ పైకి రావాల్సిన ఈ సినిమా వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వస్తుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పై కూడా మేకర్స్ చిన్నపాటి స్పష్టత ఇచ్చారు. ఆగస్ట్ లో ఈ సినిమాను స్టార్ట్ చేసి వచ్చే ఏడాది వేసవికి థియేటర్లలోకి తీసుకొస్తామని తెలిపారు.

పూజాహెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సెకెండ్ హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు. పీఎస్ వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

First Published:  9 July 2022 7:54 AM GMT
Next Story