Telugu Global
MOVIE UPDATES

కార్తికేయ 2.. డిఫరెంట్ గా సాంగ్ లాంఛ్

ఈ కాలం ప్రచారం కొత్తగా చేయకపోతే ఆడియన్స్ కు రీచ్ అవ్వడం కష్టం. ఎంత కొత్తగా ఉంటే అంత స్పీడ్ గా జనాల్లోకి వెళ్తుంది. అందుకే కార్తికేయ-2 యూనిట్ కొత్తగా ప్రమోషన్ అందుకుంది. ఏకంగా తమ సినిమాలోని సాంగ్ ను ఎక్స్ క్లూజివ్ గా కొంతమందికి చూపించాలని నిర్ణయించింది. కార్తికేయ-2లో హీరో పేరు కార్తికేయ, హీరోయిన్ పేరు ముగ్ద. వీళ్లిద్దరి మధ్య ఓ లవ్ సాంగ్ ఉంది. ఆ పాటను ఎక్స్ క్లూజివ్ గా ప్రదర్శింస్తున్నారు. నిన్న […]

కార్తికేయ 2.. డిఫరెంట్ గా సాంగ్ లాంఛ్
X

ఈ కాలం ప్రచారం కొత్తగా చేయకపోతే ఆడియన్స్ కు రీచ్ అవ్వడం కష్టం. ఎంత కొత్తగా ఉంటే అంత స్పీడ్ గా జనాల్లోకి వెళ్తుంది. అందుకే కార్తికేయ-2 యూనిట్ కొత్తగా ప్రమోషన్ అందుకుంది. ఏకంగా తమ సినిమాలోని సాంగ్ ను ఎక్స్ క్లూజివ్ గా కొంతమందికి చూపించాలని నిర్ణయించింది.

కార్తికేయ-2లో హీరో పేరు కార్తికేయ, హీరోయిన్ పేరు ముగ్ద. వీళ్లిద్దరి మధ్య ఓ లవ్ సాంగ్ ఉంది. ఆ పాటను ఎక్స్ క్లూజివ్ గా ప్రదర్శింస్తున్నారు. నిన్న ఈ సాంగ్ ను ఏలూరు, భీమవరంలోని 2 ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రదర్శించారు. ఇక ఈరోజు రాజమండ్రి, వైజాగ్ లో ఈ పాటను ప్రదర్శిస్తున్నారు. ఇక ఫుల్ వీడియో సాంగ్ ను సోమవారం ఉదయం 11 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేస్తారు.

సాధారణంగా లిరికల్ వీడియోస్ ను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంటారు. కానీ కార్తికేయ-2 సినిమాకు సంబంధించి ఏకంగా వీడియో సాంగ్ ను ఇలా ప్రదర్శించి సరికొత్త ప్రమోషన్ కు తెరదీశారు. ఇది క్లిక్ అయితే రాబోయే రోజుల్లో ఇతర సినిమా యూనిట్లు కూడా తమ సినిమా సాంగ్స్ ను ఇలా నేరుగా ప్రదర్శించే అవకాశం ఉంది.

ఈనెల 22న థియేటర్లలోకి రానుంది కార్తికేయ-2. చందు మొండేటి డైరక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై నిర్మించారు.

First Published:  8 July 2022 11:41 PM GMT
Next Story