Telugu Global
NEWS

`ముందస్తు`కు జనసేన ఉత్సాహం.. వైసీపీకి సవాల్

వైసీపీ ప్లీనరీలో చెప్పినట్టు 175 సీట్లు ఆశించడం అత్యాశే అవుతుందని అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఫ్యాన్‌ ఓవర్‌ స్పీడ్‌ తిరిగితే విరిగి కిందపడిపోతుందని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ కుమారుడని నమ్మి రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, కానీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం జగన్ చేయలేదని అన్నారు. కనీసం జగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి పాలన చేయలేదన్నారు నాదెండ్ల. పులివెందులలో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, సీఎం జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లినప్పుడు […]

`ముందస్తు`కు జనసేన ఉత్సాహం.. వైసీపీకి సవాల్
X

వైసీపీ ప్లీనరీలో చెప్పినట్టు 175 సీట్లు ఆశించడం అత్యాశే అవుతుందని అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ఫ్యాన్‌ ఓవర్‌ స్పీడ్‌ తిరిగితే విరిగి కిందపడిపోతుందని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ కుమారుడని నమ్మి రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, కానీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం జగన్ చేయలేదని అన్నారు. కనీసం జగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి పాలన చేయలేదన్నారు నాదెండ్ల. పులివెందులలో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, సీఎం జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లినప్పుడు బారికేడ్లు వేసి, షాపులు మూసివేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

దమ్ముంటే ముందస్తుకి రండి..
మేనిఫెస్టోలో 95శాతం హామీలు పూర్తి చేశామని వైసీపీ చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు నాదెండ్ల. అదే నిజమైతే.. దమ్ముంటే మార్చి లేదా ఏప్రిల్‌ లోనే ఎన్నికలు పెట్టండంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు అప్పుడు నిజమైన తీర్పు ఇస్తారని అన్నారు.

గడప గడపకు విఫలం..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విఫలమైందని అన్నారు నాదెండ్ల మనోహర్. అందుకే సీఎం జగన్‌ ఫ్రస్టేషన్‌ లో ఉన్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన విధంగా ప్లీనరీలో జగన్‌ ప్రసంగం లేదని చెప్పారు. వైసీపీ ప్రణాళిక, సిద్ధాంతం అంతా వ్యక్తి చుట్టూ తిరుగుతోందని మండిపడ్డారు.

రూ.1.27లక్షల కోట్లతో రైతులను ఆదుకున్నానని జగన్‌ చెబుతున్నారని, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్. డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో 37 వేల రూపాయలు వేశామంటున్నా.. వారి నుంచి 2 వేల కోట్ల రూపాయలు ఎందుకు వాపస్‌ తీసుకున్నారో చెప్పాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌ సొమ్ము ఎందుకు మాయమైందని ప్రశ్నించారు. సమాజాన్ని కులాల వారీగా, మతాల వారీగా చీల్చి ఓట్లు సంపాదించే ప్రయత్నం వైసీపీ చేస్తోందని, దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని, మేనిఫెస్టో ఏ స్థాయిలో అమలైందో అప్పుడు తేలుతుందని సవాల్ విసిరారు నాదెండ్ల.

First Published:  9 July 2022 10:11 AM GMT
Next Story