Telugu Global
NEWS

వైసీపీకి విజయమ్మ రాజీనామా.. ప్లీనరీలో ప్రకటన

వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. ప్లీనరీ వేదికగా ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆమెకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు. ‘కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌ తో ఉన్నా. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి వివాదాస్పదం కాకుండా ఉండేందుకే […]

YS Vijayamma
X

వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్‌ విజయమ్మ రాజీనామా చేశారు. ప్లీనరీ వేదికగా ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆమెకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు. ‘కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌ తో ఉన్నా. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి’ అంటూ ప్లీనరీలో ప్రసంగించారు విజయమ్మ.

జగన్‌ మనసుతో చేసే పాలన నా కళ్లారా చూస్తున్నా..

వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా రారా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆమె సభకు వచ్చారు. అయితే రాజీనామా ప్రకటన చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఏపీలో సీఎం జగన్ పాలనపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. జగన్‌ యువతకు రోల్ మోడల్ అని, రాష్ట్ర ప్రజలందరి ప్రేమను పొందిన జగన్‌ ను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి నావాడే కాదు.. మీ అందరీ వాడు

నా జీవితంలో ప్రతి మలుపు ప్రజా జీవితాలతో ముడిపడి ఉంది అని వైఎస్ఆర్ ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తు చేసుకున్నారు విజయమ్మ. మీ అందర్నీ అభినందించడానికి, ఆశీర్వదించడానికి ప్లీనరీకి వచ్చానంటూ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి ఆమె చెప్పారు. రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడతాయని, కానీ వైఎస్సార్సీపీ నల్ల కాలువ దగ్గర ఇచ్చిన మాట కోసం పుట్టిందని చెప్పారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన లేడని తెలిసి 700 మంది ప్రాణాలు వదిలారని, కోట్లాది మంది అభిమానం నుంచి వైఎస్ఆర్సీపీ పుట్టిందని చెప్పారు. ఎన్నో కష్టాలను, నిందలను ఎదుర్కొని వైఎస్ఆర్‌ కుటుంబం నిలబడిందని, అధికార శక్తులన్నీ విరుచుకుపడ్డా తన కొడుకు బెదరలేదని అన్నారు. నిజాయితీగా ఆలోచన చేసే వ్యక్తిత్వం జగన్ ది అని అన్నారు.

ఏపీలో అద్భుతంగా పాలన..

ఇప్పటికే లక్షా 60వేల కోట్ల రూపాయల సొమ్ముని ప్రజలకు ప్రత్యక్షంగా వైసీపీ ప్రభుత్వం అందించిందని చెప్పారు విజయమ్మ. తాను మంచి చేశానని నమ్మడం వల్లే గడపగడపకు ఎమ్మెల్యేలను జగన్ పంపుతున్నాడని అన్నారు. నాడు – నేడుతో బడుల రూపురేఖలు మారిపోతున్నాయని, జగన్ మానవత్వంతో, మనసుతో పాలన చేస్తున్నారని చెప్పారు. చెప్పినవే కాకుండా… చెప్పనవి కూడా జగన్ చేస్తున్నారని, రాష్ట్రంలో పేద తల్లులు, పేద తండ్రులు వారి బిడ్డలను జగన్ చేతిలో పెట్టాలని, జగన్ వారికి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పారు.

వైఎస్ జగన్ మాస్ లీడర్‌

వైఎస్ జగన్ మాస్ లీడర్ అని అన్నారు విజయమ్మ. దుర్గ గుడి ఫ్లై ఓవర్ ను ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేకపోయినా జగన్ సీఎం అయ్యాక పూర్తి చేశారని చెప్పారు. వైఎస్ఆర్‌ అంటే ప్రజలకు ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ అని, ప్రజలకు, వైఎస్ కుటుంబానికి 45 ఏళ్ల బంధం ఉందని, ఇకపై కూడా ఆ అనుబంధం అలాగే కొనసాగాలని అన్నారు.

First Published:  8 July 2022 3:05 AM GMT
Next Story