Telugu Global
NEWS

అధిష్టానం ఎవరంటే వాళ్లే సీఎం.. వారిని భుజాలపై ఎత్తుకుంటా: రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని, అధిష్టానం ఎవరి పేరు చెప్తే.. వారినే పల్లకిలో భుజాలపై ఎత్తుకొని సీఎం పీఠంపై కూర్చోబెడతానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవల్సిన బాధ్యత ఉందని రేవంత్ చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. మరో ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆయన […]

అధిష్టానం ఎవరంటే వాళ్లే సీఎం.. వారిని భుజాలపై ఎత్తుకుంటా: రేవంత్ రెడ్డి
X

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని, అధిష్టానం ఎవరి పేరు చెప్తే.. వారినే పల్లకిలో భుజాలపై ఎత్తుకొని సీఎం పీఠంపై కూర్చోబెడతానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవల్సిన బాధ్యత ఉందని రేవంత్ చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. మరో ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

హుజూరాబాద్‌ ఎన్నికలో పార్టీ ఓడిపోవడం తనను చాలా బాధించిందని, ఆ సమయంలో కాస్త దిగులుగా ఉన్నానని అన్నారు. అయితే పార్టీకి 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించి, తెలంగాణను కార్యకర్తలు టాప్‌లో నిలిపారన్నారు. ఆ సమయంలో కార్యకర్తలు తనకు అండగా నిలిచారని రేవంత్ చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నో పరాజయాలు ఎదుర్కున్నారని.. కానీ ఆ తర్వాత ఆయనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు.

ఇక రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక తన పాత టీడీపీ మిత్రులను చాలా మందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలోకి భారీగానే వలసలు ప్రారంభమయ్యాయి. తాజాగా మహబూబ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గురువారం గాంధీభవన్‌కు వచ్చిన శేఖర్‌ను రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎర్ర శేఖర్‌తో పాటు దేవరకొండకు చెందిన బీల్యా నాయక్‌ కూడా పార్టీలో చేరారు. టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన ఎర్ర శేఖర్ 1996, 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కొన్నాళ్ల తర్వాత బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు.

ఎర్ర శేఖర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేరికను వెంకటరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎర్ర శేఖర్ నేర చరిత్ర కలిగిన వ్యక్తని, పార్టీలో అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని కోమటిరెడ్డి చెప్పారు. ఇక, సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానితులుగా ఎన్నికైన సుబ్బిరామిరెడ్డిని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని సుబ్బిరామిరెడ్డి వ్యాఖ్యానించారు.

First Published:  7 July 2022 10:14 PM GMT
Next Story