Telugu Global
MOVIE UPDATES

ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మరో మూవీ.. డేట్ ఫిక్స్

సినిమా ఫ్లాప్ అవ్వడం ఆలస్యం, ఓటీటీలోకి వచ్చేస్తోంది. నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ విధించిన ఆంక్షల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మొన్నటికిమొన్న థియేటర్లలోకి వచ్చింది సమ్మతమే సినిమా. అయితే రిలీజైన రోజే ఫ్లాప్ అయింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఆహాలో ఈనెల 15 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది ఈ మూవీ. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓ మోస్తరు అంచనాల మధ్య గత నెల 24న థియేటర్లలోకి […]

Sammathame
X

సినిమా ఫ్లాప్ అవ్వడం ఆలస్యం, ఓటీటీలోకి వచ్చేస్తోంది. నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ విధించిన ఆంక్షల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మొన్నటికిమొన్న థియేటర్లలోకి వచ్చింది సమ్మతమే సినిమా. అయితే రిలీజైన రోజే ఫ్లాప్ అయింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఆహాలో ఈనెల 15 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది ఈ మూవీ.

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓ మోస్తరు అంచనాల మధ్య గత నెల 24న థియేటర్లలోకి వచ్చింది. కానీ మంచి రివ్యూస్ అందుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాను స్క్రీన్ ప్లే దెబ్బతీసింది. ఫస్టాఫ్ ఒకరు, సెకండాఫ్ ను మరొకరు డైరక్ట్ చేసినట్టు అనిపించింది. ఇలా రెండు షేడ్స్ ఉండడంతో సినిమా ఫ్లాప్ అయింది.

అలా ఫ్లాప్ అయిన కొన్ని రోజులకే ఈ సినిమా ఆహాలో ప్రత్యక్షమౌతోంది. అయితే తాజాగా విధించిన నిర్మాతల మండలి లాక్-ఇన్ పీరియడ్ నిబంధన ఈ సినిమాకు వర్తించదు. ఎందుకంటే, జులై 1 నుంచి విడుదలయ్యే సినిమాలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అంతకుముందు విడుదలైన సినిమాల్ని నచ్చినట్టు ఓటీటీకి ఇచ్చుకోవచ్చు. అలా సమ్మతమే సినిమా, ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

First Published:  8 July 2022 12:12 AM GMT
Next Story