Telugu Global
MOVIE UPDATES

సాయి పల్లవి నుంచి మరో సినిమా

ప్ర‌తి చిత్రంతో త‌న‌దైన నేచుర‌ల్ లుక్స్‌, పెర్ఫామెన్స్‌తో ప్రేక్ష‌కుల మనసులు దోచుకుంటున్న హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి. తెలుగులో ఆమెకున్న ఫాలోయింగ్‌, ఫ్యాన్ బేస్‌తో ఆమెను లేడీ సూప‌ర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. రీసెంట్‌గా విడుద‌లైన విరాట‌ప‌ర్వం చిత్రంతో ప్రేక్ష‌కులకు మరోసారి దగ్గరైంది సాయి ప‌ల్ల‌వి. ఇప్పుడ గార్గి అనే మ‌రో వైవిధ్య‌మైన చిత్రంతో మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మైంది. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ దర్శకత్వంలో తెరకెక్కింది గార్గి. జూలై 15న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ […]

సాయి పల్లవి నుంచి మరో సినిమా
X

ప్ర‌తి చిత్రంతో త‌న‌దైన నేచుర‌ల్ లుక్స్‌, పెర్ఫామెన్స్‌తో ప్రేక్ష‌కుల మనసులు దోచుకుంటున్న హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి. తెలుగులో ఆమెకున్న ఫాలోయింగ్‌, ఫ్యాన్ బేస్‌తో ఆమెను లేడీ సూప‌ర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. రీసెంట్‌గా విడుద‌లైన విరాట‌ప‌ర్వం చిత్రంతో ప్రేక్ష‌కులకు మరోసారి దగ్గరైంది సాయి ప‌ల్ల‌వి. ఇప్పుడ గార్గి అనే మ‌రో వైవిధ్య‌మైన చిత్రంతో మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మైంది.

గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ దర్శకత్వంలో తెరకెక్కింది గార్గి. జూలై 15న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను పెంచారు. ఈ సినిమా ట్రయిల‌ర్‌ను తాజాగా లాంచ్ చేశారు. హీరోలు నాని, రానా తమ సోష‌ల్ మీడియా వేదికలుగా ఈ ట్రయిలర్ ను లాంచ్ చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఇదొక స్కూల్ టీచ‌ర్ జ‌ర్నీ గురించి తెలియ‌జేసే చిత్ర‌మ‌ని తెలుస్తోంది. ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ప్పుడు ఆ రాత్రి ఆమె ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంద‌నేది ప్ర‌ధాన క‌థాంశం. మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను కట్టిపడేసేలా కట్ చేశారు. గోవింద్ వ‌సంత నేప‌థ్య సంగీతం.. ట్రైల‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. ఇదొక ఇంటెన్స్ కోర్ట్ డ్రామా అని ట్రైల‌ర్‌ చూస్తే అర్థమౌతోంది.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో జూలై 15న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, ర‌విచంద్ర‌న్ రామ‌చంద్ర‌న్‌, గౌత‌మ్ రామ‌చంద్ర‌న్‌, థామ‌స్ జార్జి త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రానా ద‌గ్గుబాటి.. త‌మిళంలో 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

First Published:  7 July 2022 10:23 PM GMT
Next Story