Telugu Global
International

బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడు రిషి సునాక్… కాస్త కష్టమే

బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక ఇక ఆ పదవిలో నెక్స్ట్ ఎవరు ఉంటారనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండియన్ ఆరిజిన్ అయిన (భారత సంతతికి చెందిన) రిషి సునాక్ పేరు పదేపదే వినిపించింది. ఇది భారతీయులకు గర్వ కారణమని కూడా పొంగిపోయాం.. కానీ తాజా లెక్కలు దీనికి అనుగుణంగా లేవు. బోరిస్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా వ్యవహరించిన బెన్ వాలెస్ ని ఈ పదవి వరించవచ్చునని తెలుస్తోంది. కేర్ టేకర్ గా ఇప్పటికీ ఆయన ఈ […]

Rishi Sunak
X

బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక ఇక ఆ పదవిలో నెక్స్ట్ ఎవరు ఉంటారనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండియన్ ఆరిజిన్ అయిన (భారత సంతతికి చెందిన) రిషి సునాక్ పేరు పదేపదే వినిపించింది.

ఇది భారతీయులకు గర్వ కారణమని కూడా పొంగిపోయాం.. కానీ తాజా లెక్కలు దీనికి అనుగుణంగా లేవు. బోరిస్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా వ్యవహరించిన బెన్ వాలెస్ ని ఈ పదవి వరించవచ్చునని తెలుస్తోంది. కేర్ టేకర్ గా ఇప్పటికీ ఆయన ఈ శాఖలో కొనసాగుతున్నారు. తదుపరి దేశ ప్రధాని ఎవరన్నదానిపై ఒపీనియన్ పోల్ నిర్వహించినప్పుడు ఈయన పేరే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఉక్రెయిన్, రష్యా వార్ సందర్భంలో బెన్ వాలెస్ దేశ పరిస్థితిని సమర్థంగా నిర్వహించారని 716 మంది కన్సర్వేటివ్ సభ్యులు ఆయనకే జై కొట్టారు.

పైగా ఈయనపై ఎలాంటి వివాదాలు లేవట. ఈయన తరువాత ఇంటర్నేషనల్ ట్రేడ్ (అంతర్జాతీయ వాణిజ్యం) వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ రెండో స్థానంలో నిలిచారు. కొంతకాలంగా ఈమె పేరు కూడా ప్రధాని పోస్టుకు సంబంధించి రేసులో వినిపించింది. ఎంపీల్లో, కన్సర్వేటివ్ పార్టీలో ఈమెకు మంచి పేరు ఉంది. ఈమె తరువాత మూడో స్థానంలో రిషి సూనక్ ని ఎంపిక చేశారు.

కానీ ఈ ఒపీనియన్ పోల్ శాంపిల్ గానే జరిగిందని, పూర్తిగా విశ్వసించలేమని కూడా కన్సర్వేటివ్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ ఫలితాలు ఊహించినవే అని కూడా కొందరు సభ్యులు సన్నాయి నొక్కులు నొక్కారు. ఇక రిషి సూనక్ విషయానికే వస్తే.. మొదట్లో పీఎం పదవికి ఈయనే సరైనవాడని వార్తలు వచ్చినప్పటికీ తాజా పరిణామాలు ఈయనను మూడో స్థానంలోకి నెట్టివేసినట్టు కనబడుతోంది.

ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కోవిడ్ పాండమిక్ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు భారీగా అప్పులు తెచ్చినందున ఆ భారం తగ్గించేందుకు సూనక్ పన్నులను పెంచారట. ఆయన పాపులారిటీ మసక బారడానికి ఇదో కారణమంటున్నారు. పైగా ఈయన భార్య అక్షతా మూర్తి నాడు పన్నుల కుంభకోణంలో ఇరుక్కున్నారు.

ఆమె టాక్సుల వ్యవహారంలో విచారణ కూడా జరిగింది. ఇది గత ఏప్రిల్ లోని మాట.. ఆమె టాక్సుల ఉదంతం వివాదంగా మారి ఆ ప్రభావం కొంతవరకు సూనక్ పొలిటికల్ కెరీర్ మీదా పడడంతో . ఆయన ప్రతిష్ట తగ్గింది. టెస్ట్ లో ఆయన నెగ్గుతాడా అన్నది సందిగ్ధంగా మారింది.

ఇక ఒపీనియన్ పోల్ లో వాలెస్ కి 13 శాతం, పెన్నీకి 12, రిషి సూనక్ కి 10 శాతం చొప్పున ‘ఓట్లు’ పడ్డాయి. వీరి తరువాత విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ట్ 8 శాతంతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక రేసులో తాను కూడా ఉంటానని ప్రకటించిన ఇండియన్ హెరిటేజ్ ‘పోకడల’ సువేల్లా ఫెర్నాండెజ్ బ్రేవర్ మన్ కి ఎవరూ మద్దతు ప్రకటించలేదు.

First Published:  8 July 2022 1:11 AM GMT
Next Story