Telugu Global
National

త‌గ్గేదేలేదు.. ఎన్నిక‌లు జ‌ర‌పండి.. ఉద్ధ‌వ్ స‌వాల్

ఒక్కొక్క‌రుగా ఎమ్మెల్యేలంతా పార్టీని వీడి తిరుగుబాటు వ‌ర్గంలో చేరిపోతున్నా శివ‌సేన అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న బింకాన్ని వీడ‌డం లేదు. ఎవ‌రెన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా శివ‌సేన చిహ్నాన్ని పొంద‌లేర‌ని ఉద్ఘాటించారు. పార్టీ చిహ్న‌మైన విల్లు, బాణం గుర్తును తిరుగుబాటుదారులను ఉపయోగించనివ్వబోమని స్ప‌ష్టంచేశారు. ఎవ‌రు ఏమిటో తేల్చుకునేందుకు రాష్ట్రంలో తాజాగా ఎన్నిక‌లు జ‌ర‌పాలంటూ స‌వాల్ విసిరారు. “ఈరోజే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్‌ చేస్తున్నాను. మనం తప్పు చేస్తే జనం ఇంటికి పంపిస్తారు. మరి […]

త‌గ్గేదేలేదు.. ఎన్నిక‌లు జ‌ర‌పండి.. ఉద్ధ‌వ్ స‌వాల్
X

ఒక్కొక్క‌రుగా ఎమ్మెల్యేలంతా పార్టీని వీడి తిరుగుబాటు వ‌ర్గంలో చేరిపోతున్నా శివ‌సేన అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న బింకాన్ని వీడ‌డం లేదు. ఎవ‌రెన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా శివ‌సేన చిహ్నాన్ని పొంద‌లేర‌ని ఉద్ఘాటించారు. పార్టీ చిహ్న‌మైన విల్లు, బాణం గుర్తును తిరుగుబాటుదారులను ఉపయోగించనివ్వబోమని స్ప‌ష్టంచేశారు. ఎవ‌రు ఏమిటో తేల్చుకునేందుకు రాష్ట్రంలో తాజాగా ఎన్నిక‌లు జ‌ర‌పాలంటూ స‌వాల్ విసిరారు.

“ఈరోజే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్‌ చేస్తున్నాను. మనం తప్పు చేస్తే జనం ఇంటికి పంపిస్తారు. మరి మీరు చేయాల్సింది ఇదే అయితే రెండున్నరేళ్ల క్రితమే చేసి ఉండాల్సింది గౌరవప్రదంగా జరిగేది. ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉండేది కాదు“ అని ఉద్ధ‌వ్ అన్నారు. శివసేన నుంచి విల్లు, బాణం గుర్తును ఎవరూ తీసుకోలేరు. ప్రజలు గుర్తును మాత్రమే చూడరని, గుర్తు తీసుకున్న వ్యక్తిని చూస్తారంటూ ప‌రోక్షంగా తిరుగుబాటు నేత‌ను ఉద్దేశించి చుర‌క‌లంటించారు.

ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు ప‌ర్వం అనంత‌రం మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొలిసారిగా శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ఎన్నికలు జ‌ర‌పాల‌ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. గత రెండున్నరేళ్లలో బీజేపీ తనను, త‌న కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నిందించినా.. మౌనంగా ఉన్నానంటూ తిరుగుబాటు వ‌ర్గంపై విరుచుకుప‌డ్డారు. “మీరు వారితో టచ్‌లో ఉంటూ మీ స్వంత పార్టీకి ఇలా ద్రోహం చేస్తున్నారు” అని షిండే పేరు చెప్పకుండానే విమ‌ర్శించారు. ‘‘కొందరు నాపై గౌరవం ఉందని., మాతోశ్రీకి పిలిస్తే వస్తాం అన్నారు.

అందుకు నా కృతజ్ఞతలు.. కానీ మీరు వచ్చి నాతో మాట్లాడి ఉంటే అలా ఆ టూర్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మీరు నా కుటుంబాన్ని దుర్భాషలాడిన వారితో ఉన్నారు. వారు మా ప్రతిష్టపై దాడులు చేశారు. కాబట్టి మీ ప్రేమ, గౌరవం నిజమో కాదో మీరే నిర్ణయించుకోండి” అని రెబల్స్ ను ఉద్దేశించి అన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా నాతో ఉన్న 15-16 మంది ఎమ్మెల్యేలను చూసి గర్విస్తున్నాను. ఈ దేశం సిద్ధాంతం సత్యమేవ జయతే.. అంతే కానీ, అసత్యమేవ జయతే కాదు అని అన్నారు.

న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది..

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల మాకు గౌర‌వం ఉంది. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. న్యాయవ్యవస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో ప్రజలు గ‌మ‌నిస్తున్నారు. కోర్టు నిర్ణయం గురించి నేను చింతించను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని అన్నారు ఉద్ధ‌వ్ ఠాక్రే. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కేవలం శివసేన భవిష్యత్తునే కాదు, భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందన్నారు.

శివసేనను ఎవరూ దూరం చేయలేరు. లెజిస్లేచర్ పార్టీ ఉంది, క్షేత్ర‌స్థాయిలో పనిచేసే పార్టీ ఇది. ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీని లాగేసుకోగలరా..? భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవ‌రూ భ‌య‌ పడకండి. లెజిస్లేచర్ పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ రెండూ వేర్వేరు అంశాలు” అని ఠాక్రే అన్నారు. నాయ‌కులు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి న‌ష్టం ఏమీ లేదు. సుశిక్షితులైన సైనికుల్లాంటి శివ‌సైనికులు అండ‌గా నిలుస్తార‌ని అన్నారు.

First Published:  8 July 2022 6:32 AM GMT
Next Story