Telugu Global
National

2017లో చేసిన ట్వీట్ కు ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ

హర్యానా బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జి అరుణ్ యాదవ్ 2017 సంవత్సరంలో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఓ ట్వీట్ చేశారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆయనను బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఓపీ ధన్‌కర్ పార్టీ పార్టీ లోంచి బహిష్కరించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుల్షన్ భాటియా ఓ ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్త పై బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ నుంచి […]

2017లో చేసిన ట్వీట్ కు ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
X

హర్యానా బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జి అరుణ్ యాదవ్ 2017 సంవత్సరంలో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఓ ట్వీట్ చేశారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆయనను బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఓపీ ధన్‌కర్ పార్టీ పార్టీ లోంచి బహిష్కరించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుల్షన్ భాటియా ఓ ప్రకటన విడుదల చేశారు.

మహ్మద్ ప్రవక్త పై బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ నుంచి ఆమె బహిష్కరణ నేపథ్యంలో అరుణ్ యాదవ్ 2017లో చేసిన ట్వీట్ మళ్ళీ వైరల్ అయ్యింది. అనేక మంది ఆయన ట్వీట్ ను షేర్ చేశారు. అతనిని అరెస్టు చేయాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. #ArrestArunYadav అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది.

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబెయిర్ 2018లో పోస్ట్ చేసిన ట్వీట్ కారణంగా ఆయనను ఇప్పుడు అరెస్టు చేసినప్పుడు అరుణ్ యాదవ్ ను ఎందుకు అరెస్టు చేయరు? అని ప్రశ్నిస్తూ టిప్పు సుల్తాన్ పార్టీ అధ్యక్షుడు షేక్ సాదిక్ ట్వీట్ చేశారు.

”బీజేపీ మరో చిల్లర వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఇటువంటి కంటితుడుపు చర్యలు కాకుండా విద్వేషాన్ని రెచ్చగొట్టే వారందరినీ అర్తెస్టు చేయాలి” అని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మొన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, ఐటీ సెల్ ఇంచార్జ్ నవీన్ జిందాల్ లను బహిష్కరించిన బీజేపీ ఇప్పుడు అరుణ్ యాదవ్ ను బహిష్కరించింది. అయితే బీజేపీ ఈ బహిష్కరణల కార్యక్రమం నిజాయితీగానే చేస్తోందా లేక బీవీ శ్రీనివాస్ అన్నట్టు కంటి తుడుపు చర్యలా అనేది ఆ పార్టీ ఆచరణ తేలుస్తుంది.

First Published:  8 July 2022 3:41 AM GMT
Next Story