Telugu Global
National

ఘోర రోడ్డు ప్రమాదం… 9 మంది జల సమాధి

ఉత్తరాఖండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఓ కారు నదిలో పడి 9 మంది మరణించారు. పంజాబ్ పాటియాలా నివాసితులైన 10 మ‍ంది పర్యాట‌కులు ఉత్తరాఖండ్ లో పర్యటించి పంజాబ్ తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. వీళ్ళు ప్రయాణిస్తున్న కారు రాంనగర్ ప్రాంతంలో అదుపుతప్పి ధేలా నదిలో పడిపోయింది. వరద‌ల కారణంగా నది తీవ్రంగా ప్రవహిస్తుండటంతో అందులో పడిన కారు వేగంగా కొట్టుకపోయి మునిగి పోయింది. ఈ రోజు ఉదయం 5.45 గంటలకు […]

ఘోర రోడ్డు ప్రమాదం… 9 మంది జల సమాధి
X

ఉత్తరాఖండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఓ కారు నదిలో పడి 9 మంది మరణించారు.

పంజాబ్ పాటియాలా నివాసితులైన 10 మ‍ంది పర్యాట‌కులు ఉత్తరాఖండ్ లో పర్యటించి పంజాబ్ తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. వీళ్ళు ప్రయాణిస్తున్న కారు రాంనగర్ ప్రాంతంలో అదుపుతప్పి ధేలా నదిలో పడిపోయింది. వరద‌ల కారణంగా నది తీవ్రంగా ప్రవహిస్తుండటంతో అందులో పడిన కారు వేగంగా కొట్టుకపోయి మునిగి పోయింది. ఈ రోజు ఉదయం 5.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. మొత్తం 10 మంది ప్రయాణికుల్లో నాజియా అనే 22 ఏళ్ల మహిళను మాత్రం రక్షించగలిగారు. మిగతా 9 మందీ చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు.

ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను బైటికి తీయగలిగారు. ఇంకో ఐదుగురు నదిలో మునిగిపోయిన వాహనంలోనే ఉన్నారు. వారు కూడా మరణించిఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఉదయం 5 గంటల సమయంలో కార్బెట్ పార్కు వైపు వేగంగా దూసుకెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. అలా వెళ్లిన కారు ధేలా గ్రామంలోని నదిలో బలమైన ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు వివరించారు. నదిపై ఆ ప్రాంతంలో వంతెన లేక పోవడం, భారీ వర్షాల కారణంగా నది భారీగా ప్రవహిస్తూండటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు.

కాగా, ఇక్కడ గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. ఈ నదిపై వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

May be an image of 11 people, people standing, outdoors and text that says

First Published:  8 July 2022 12:01 AM GMT
Next Story