Telugu Global
MOVIE UPDATES

సీఐ మురళిగా వేణు.. రీఎంట్రీ షురూ

కొంత విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి, రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించాడు. ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్ లో […]

సీఐ మురళిగా వేణు.. రీఎంట్రీ షురూ
X

కొంత విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి, రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించాడు. ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్ లో సీఐ మురళిగా వేణు కాస్త సీరియస్‌ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పాత్ర దాదాపు సినిమా మొత్తం రవితేజతో కలిసి ట్రావెల్ చేస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, మేకర్స్ ఇప్పటివరకు 3 పాటలు రిలీజ్ చేశారు. వాటికి అంతగా రెస్పాన్స్ రాలేదు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘నా పేరు సీసా’ అనే ఐటెంసాంగ్ కు కూడా రెస్పాన్స్ అంతంతమాత్రమే. త్వరలోనే ఈ సినిమా టైటిల్ సాంగ్‌ ని విడుదల చేయనున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

First Published:  7 July 2022 12:37 AM GMT
Next Story