Telugu Global
National

ఫ్లాష్ కాల్ వెరిఫికేషన్ సహా.. వాట్సప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్‘ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌ను ఉపయోగించే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్న వాట్సప్ ఇప్పుడు అథంటికేషన్‌ను కూడా మరింత వేగంగా పూర్తి చేసేలా ఫ్లాష్ కాల్ ఫీచర్ తీసుకొని వచ్చింది. కొత్త ఫోన్లలో లాగిన్ అవ్వాలన్నా, రీఇన్‌స్టాల్ చేసినప్పుడు కూడా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. వాట్సప్‌ను ఉపయోగించాలంటే మన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసిన […]

ఫ్లాష్ కాల్ వెరిఫికేషన్ సహా.. వాట్సప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
X

ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్‘ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌ను ఉపయోగించే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్న వాట్సప్ ఇప్పుడు అథంటికేషన్‌ను కూడా మరింత వేగంగా పూర్తి చేసేలా ఫ్లాష్ కాల్ ఫీచర్ తీసుకొని వచ్చింది. కొత్త ఫోన్లలో లాగిన్ అవ్వాలన్నా, రీఇన్‌స్టాల్ చేసినప్పుడు కూడా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది.

వాట్సప్‌ను ఉపయోగించాలంటే మన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత, మనకు వచ్చే ఆరు నెంబర్ల కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాట్సప్ వెరిఫికేషన్ పూర్తవుతుంది. అయితే ఇంత ప్రాసెస్ లేకుండా కేవలం ఒక్క ఫ్లాష్ కాల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసేలా వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. ఇలా వెరిఫికేషన్ పూర్తి చేయాలంటే ఫోన్ కాల్ హిస్టరీ, లొకేషన్, ఎసెమ్మెస్ యాక్సెస్‌కు అనుమతులు ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే.. ఒక మిస్ కాల్ వస్తుంది. దీన్ని వాట్సప్ దానికదే స్కాన్ చేసుకొని అథంటికేషన్ పూర్తి చేస్తుంది. ఈ ప్రాసెస్ అత్యంత వేగంగా, క్షణాల్లోనే ముగిసిపోతోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నది.

వాట్సప్‌లో ఏదైనా ఫొటోను ఇతరులకు పంపించే ముందు.. దాన్ని క్రాప్, రొటేట్ చేయడంతో పాటు ఎమోజీలు, టెక్ట్స, స్టిక్కర్లు యాడ్ చేసుకోవచ్చు. ఎవరి ముఖం అయినా కనపడకుండా చేయాలంటే ఇప్పటి వరకు అక్కడ ఎమోజీలు జత చేస్తున్నారు. కానీ ఇకపై మనకు ఇష్టం వచ్చిన దగ్గర బ్లర్ చేసుకునే అవకాశాన్ని కూడా వాట్సప్ కల్పించనున్నది. దీంతో పాటు ఎమోజీలతో రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఫేస్‌బుక్ లాగా ఆరు ఎమోజీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ ఇకపై మరిన్ని ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆరు ఎమోజీల పక్కనే ప్లస్ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరిన్ని ఎమోజీలు వస్తాయి. ఈ ఫీచర్లన్నీ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వాబీటాఇన్ఫో తెలియజేసింది.

First Published:  7 July 2022 6:47 AM GMT
Next Story