Telugu Global
NEWS

చింతమనేని చెప్పేవి అబద్దాలు.. ఆయన స్పాట్‌లో ఉన్నాడు : డీఎస్పీ భీమ్ రెడ్డి

హైదరాబాద్ శివారులోని ఒక తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి మఫ్టీలో వెళ్లిన పటాన్‌చెరు పోలీసులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని కూడా వీడియో తీశారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని చింతమనేని సహా పలువురు వీఐపీలు పారిపోయారు. 49 మంది పందెంరాయుళ్లతో పాటు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పరారీలో ఉన్న చింతమనేని ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. తాను […]

చింతమనేని చెప్పేవి అబద్దాలు.. ఆయన స్పాట్‌లో ఉన్నాడు : డీఎస్పీ భీమ్ రెడ్డి
X

హైదరాబాద్ శివారులోని ఒక తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి మఫ్టీలో వెళ్లిన పటాన్‌చెరు పోలీసులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని కూడా వీడియో తీశారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని చింతమనేని సహా పలువురు వీఐపీలు పారిపోయారు. 49 మంది పందెంరాయుళ్లతో పాటు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, పరారీలో ఉన్న చింతమనేని ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. తాను కోడి పందాలు జరుగుతున్న ప్లేస్‌లో లేకపోయినా.. అనవసరమైన కేసులో ఇరికించారని చెప్పుకొచ్చారు. తనకు సంబంధం లేని కేసులో పారిపోయినట్లు పోలీసులు ఎందుకు ప్రకటించారో తనకు తెలుసన్నారు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి. నీచమైన ప్రచారంతో పేకమేడలు కట్టి అధికారంలోకి వచ్చారనీ కేసీఆర్, జగన్‌పై విమర్శలు చేశారు.

కాగా, నిజంగా చింతమనేని అక్కడ లేకుంటే పోలీసులు కేసెందుకు పెడతారనే అనుమానాలు వస్తున్నాయి. తనకు సంబంధం లేకపోతే బయటకు వచ్చి మీడియా మీట్ పెట్టవచ్చు కదా.. ఇలా ఎక్కడో దాక్కొని పోస్టులెందుకు పెడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు కోడిపందాల్లో ఇరికించమని సీఎం స్థాయి వ్యక్తులు పోలీసులకు ఎందుకు చెప్తారని ప్రశ్నిస్తున్నారు.

కోడిపందాలపై దాడి చేసిన డీఎస్పీ భీమ్ రెడ్డి కూడా చింతమనేని పోస్టుపై స్పందించారు. చింతమనేని చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. తాము మఫ్టీలో వెళ్లి.. తీసిన వీడియోలు భద్రంగా ఉన్నాయన్నారు. చింతమనేని సంఘటన స్థలంలో ఉన్న విషయం కూడా వీడియోల్లో రికార్డు అయ్యిందని స్పష్టం చేశారు. అనవ‌స‌రంగా తాము ఎవరినీ ఇరికించలేదని చెప్పారు. చింతమనేని పరారీలో ఉన్నాడని, ఆయనే ప్రధాన నిందితుడని చెప్పుకొచ్చారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నామని అన్నారు.

First Published:  7 July 2022 7:58 AM GMT
Next Story