Telugu Global
National

ఈ ఇద్దరి మధ్య‌ సైలెంట్ వార్!

నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (NDPS), 1985 అనే శక్తివంతమైన చట్టాన్ని ఎవరు నియంత్రించాలనే దానిపై కేంద్ర ఆర్థిక శాఖ, హోం మంత్రిత్వ శాఖల మధ్య నిశ్శబ్ద టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఈ చట్టం నియంత్రణను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మార్చాలని అమిత్ షా ఆధ్వర్యంలోని హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది, అయితే నిర్మలా సీతారామన్ ఆద్వర్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ చర్యను వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రస్తుతం, కేంద్ర హోం […]

ఈ ఇద్దరి మధ్య‌ సైలెంట్ వార్!
X

నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (NDPS), 1985 అనే శక్తివంతమైన చట్టాన్ని ఎవరు నియంత్రించాలనే దానిపై కేంద్ర ఆర్థిక శాఖ, హోం మంత్రిత్వ శాఖల మధ్య నిశ్శబ్ద టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.

ఈ చట్టం నియంత్రణను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మార్చాలని అమిత్ షా ఆధ్వర్యంలోని హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది, అయితే నిర్మలా సీతారామన్ ఆద్వర్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ చర్యను వ్యతిరేకిస్తూ వస్తోంది.

ప్రస్తుతం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను నిర్వహిస్తుండగా, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ (DoR) NDPS చట్టం ప్రకారం పాలసీలను నిర్వహిస్తుంది, రూపొందిస్తుంది.

అమిత్ షా తన మంత్రిత్వ శాఖ అధికార పరిధిని పెంచాలని కోరుకుంటున్నారు. మొత్తం మాదక ద్రవ్యాలకు సంబంధించిన అన్ని విషయాలు అతని మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంచాలని ఆయన అభిప్రాయం. ఇందులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు, మత్తుపదార్థాల అక్రమ ఉత్పత్తికి వ్యతిరేకంగా, ప్రభుత్వ కర్మాగారాల్లో నల్లమందును ప్రాసెస్ చేయడం, ఈ ఔషధాల దిగుమతి, ఎగుమతి వంటివి ఉంటాయి. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ ఎక్కువగా ఆదాయాన్ని సృష్టిస్తాయి. అందువల్ల ఇవి ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి.

గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ 2003 లో అప్పటి హోంమంత్రి ఎల్ కే అద్వానీ కోరిక మేరకు హోం మంత్రిత్వ శాఖకు మార్చబడింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చాలా కాలంగా ఇదే వాదనను కొనసాగిస్తోంది. “ అన్ని ఏజెన్సీలను హోం మంత్రిత్వ శాఖ కిందకు తీసుకురావాలి” అని 2017 లో క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ క్యాబినెట్ నోట్ పేర్కొంది.

దీనిపై ఆర్థిక శాఖ వాదన మరోలా ఉంది.

మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ, “రెండింటిని వేరు చేయడం ముఖ్యం. మాదక ద్రవ్యాల రాబడి, ఉత్పత్తి నియంత్రణను అక్రమ రవాణా , డ్రగ్స్ వినియోగం నుండి వేరుచేయాలి. ఈ రెండింటినీ విడదీస్తూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తే, అది మరింత సమగ్రమైన విధానమే కాకుండా ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన పరిష్కారం కూడా అవుతుంది.” అన్నారు.

మొత్తానికి ఈ వ్యవహారంలో అమిత్ షా, నిర్మాలా సీతారామన్ మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. ఇరు మంత్రిత్వ శాఖల అధికారులు తమ తమ వాదనలకు పదును పెడుతున్నారు. ఎవరికి వారు తమదే సరైన వాదన అని చెప్పేందుకు అనేక దేశాల చట్టాలను కూడా ఉదహరిస్తున్నారు. అయితే చివరకు ఈ సైలెంట్ వార్ లో ఎవరు గెలుస్తారు ? అమిత్ షా నా ? నిర్మలా సీతారామనా ?

First Published:  7 July 2022 12:14 AM GMT
Next Story