Telugu Global
MOVIE UPDATES

వెయ్యి మంది డాన్సర్లతో రామ్ చరణ్

దర్శకుడు శంకర్ అంటే భారీతనానికి పెట్టింది పేరు. సినిమాలో సన్నివేశాలే కాదు, పాటలు కూడా రిచ్ గా ఉండాలని కోరుకునే దర్శకుడీయన. ప్రస్తుతం చేస్తున్న రామ్ చరణ్ సినిమాను కూడా అంతే భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు శంకర్. సినిమాలో ఒక పాట కోసం ఏకంగా వెయ్యి మంది డాన్సర్లను పెట్టుకున్నాడు. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో కీలకమైన సాంగ్ ఒకటి ఉంది. ఆ పాట కోసం అమృతసర్ లో 3 రోజులు షూటింగ్ చేశారు. అక్కడ […]

Ram charan and shankar movie
X

దర్శకుడు శంకర్ అంటే భారీతనానికి పెట్టింది పేరు. సినిమాలో సన్నివేశాలే కాదు, పాటలు కూడా రిచ్ గా ఉండాలని కోరుకునే దర్శకుడీయన. ప్రస్తుతం చేస్తున్న రామ్ చరణ్ సినిమాను కూడా అంతే భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు శంకర్. సినిమాలో ఒక పాట కోసం ఏకంగా వెయ్యి మంది డాన్సర్లను పెట్టుకున్నాడు.

రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో కీలకమైన సాంగ్ ఒకటి ఉంది. ఆ పాట కోసం అమృతసర్ లో 3 రోజులు షూటింగ్ చేశారు. అక్కడ వెయ్యి మంది డాన్సర్లతో షూట్ చేశారు. తిరిగి హైదరాబాద్ వచ్చింది యూనిట్. హైదరాబాద్ లో అదే పాటను కంటిన్యూ చేస్తారు. 4 రోజుల పాటు ఆ సాంగ్ షూట్ చేస్తారు. ఇక్కడ కూడా వెయ్యి మంది డాన్సర్లను వాడుతున్నారు. ఇలా భారీ ఎత్తున ఈ సాంగ్ షూట్ జరుగుతోంది.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తవ్వగానే, యూనిట్ అంతా మరోసారి రాజమండ్రి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రాజమండ్రిలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. రామ్ చరణ్, అంజలి కాంబినేషన్ లో సీన్లు తీశారు. ఇప్పుడు మరోసారి యూనిట్ అంతా రాజమండ్రి షెడ్యూల్ ప్లాన్ చేసింది.

ఇక ఓవరాల్ షూటింగ్ విషయానికొస్తే.. ఇప్పటికి 70శాతం షూట్ పూర్తయినట్టు యూనిట్ తెలిపింది. డిసెంబర్ నాటికి టోటల్ షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  7 July 2022 6:21 AM GMT
Next Story