Telugu Global
NEWS

రాజమౌళి తండ్రికి రాజ్యసభ.. బండి సంజయ్ పై ట్రోలింగ్..

రాజమౌళికి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు రికమెండ్ చేసింది కేంద్రం. సోషల్ మీడియాలో రాజమౌళికి, ఆయన తండ్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా విజయేంద్రప్రసాద్ కి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ విషయానికీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీ ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఈ ప్రకటన వెలువడినప్పటినుంచీ బండి సంజయ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా […]

రాజమౌళి తండ్రికి రాజ్యసభ.. బండి సంజయ్ పై ట్రోలింగ్..
X

రాజమౌళికి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు రికమెండ్ చేసింది కేంద్రం. సోషల్ మీడియాలో రాజమౌళికి, ఆయన తండ్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా విజయేంద్రప్రసాద్ కి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ విషయానికీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీ ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఈ ప్రకటన వెలువడినప్పటినుంచీ బండి సంజయ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా టీఆర్ఎస్ అభిమానులు సంజయ్ ని ఓ ఆటాడేసుకుంటున్నారు.

అసలేంటి కథ..?
ఆమధ్య జీహెచ్ఎంసీ ఎన్నికల విజయం తర్వాత బండి సంజయ్ ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరించేవారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ టైమ్ లో ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కొమరంభీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ సినిమాలో కాసేపు ముస్లింల ఇంటిలో తలదాచుకునే సన్నివేశాలున్నాయి. ఆ సందర్భంలో ఎన్టీఆర్ వస్త్రధారణ వారిలాగే ఉంటుంది. కుర్తా పైజామా తలపై టోపీతో కనిపించే సన్నివేశాలుంటాయి. ఆ సీన్లకు సంబంధించి విడుదలైన పోస్టర్లపై అప్పట్లో బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజమౌళిపై విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో సినిమా ప్రదర్శన జరగకుండా అడ్డుకుంటామన్నారు. తెరలన్నిటినీ పొరలు పొరలుగా చించేస్తామని చెప్పారు. కొమరం భీమ్ కి టోపీ పెడతావా..? నిజాం క్యారెక్టర్ చేసే వ్యక్తికి బొట్టు పెట్టి కాషాయం కండువా వేయగలవా రాజమౌళీ అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాదు రాజమౌళి హిందూత్వ వ్యతిరేకి అన్నట్టుగా మాట్లాడారు. కట్ చేస్తే ఇప్పుడు అదే రాజమౌళిని, ఆయన కుటుంబాన్ని కేంద్రం, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నెత్తినపెట్టుకుంది. దీంతో బండి సంజయ్ పై ట్రోలింగ్ మొదలైంది.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథకుడే కానీ, దర్శకుడిగా ఆయన చాలా విఫల ప్రయత్నాలు చేశారు. కేవలం రాజమౌళి సినిమాల వల్లే ఆయన తండ్రికి పేరొచ్చింది. రాజమౌళికి ఉన్న క్రేజ్ వల్లే ఆయన తండ్రి కూడా పాపుల‌ర్‌ అయ్యారు. ఇప్పుడీ రాజ్యసభ సీటుని కేవలం విజయేంద్రప్రసాద్ ప్రతిభకు ఇచ్చిన గుర్తింపుగా కాకుండా.. రాజమౌళి కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యతగా గుర్తించాలి. అంటే అప్పుడు తిట్టిన నోటితోటే, ఇప్పుడు రాజమౌళిని, ఆయన తండ్రిని బండి సంజయ్ పొగడాలనమాట. మోదీయే ఆయన పేరుతో ట్వీట్ వేశారు కాబట్టి, బండి సంజయ్ నేరుగా రాజమౌళి ఇంటికెళ్లి శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఇలాంటి పరిస్థితి వస్తుందని సంజయ్ ఊహించలేదని, అధిష్టానం ఆయన్ను మరోసారి ఫూల్ ని చేసిందని అంటున్నారు నెటిజన్లు. ట్రోలింగ్ మొదలు పెట్టారు.

First Published:  6 July 2022 7:53 PM GMT
Next Story