Telugu Global
MOVIE UPDATES

బుల్లితెరపై కూడా ఫ్లాప్ అయిన రాధేశ్యామ్

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్ అయింది. నెగెటివ్ టాక్ రావడంతో ప్రభాస్ వెంటనే తప్పుకున్నాడు. కానీ మ్యూజిక్ డైరక్టర్ తమన్, దర్శకుడు రాధాకృష్ణకుమార్ తెగ కష్టపడ్డారు. రిలీజ్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వీళ్లిద్దరూ కలిసి తిరిగారు. కానీ ఫలితం లేకపోయింది. అలా థియేటర్లలో ఫెయిలైన ఈ సినిమా ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ […]

Radhe Shyam Movie
X

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆటకే ఫ్లాప్ అయింది. నెగెటివ్ టాక్ రావడంతో ప్రభాస్ వెంటనే తప్పుకున్నాడు. కానీ మ్యూజిక్ డైరక్టర్ తమన్, దర్శకుడు రాధాకృష్ణకుమార్ తెగ కష్టపడ్డారు. రిలీజ్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వీళ్లిద్దరూ కలిసి తిరిగారు. కానీ ఫలితం లేకపోయింది.

అలా థియేటర్లలో ఫెయిలైన ఈ సినిమా ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి వచ్చింది. ఓటీటీలో కూడా సేమ్ రిజల్ట్. ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు. విడుదలైన ఒక్క రోజు మాత్రం అమెజాన్ లో ట్రెండ్ అయిన ఈ సినిమా ఆ తర్వాత దుకాణం సర్దేసింది.

ఇప్పుడీ సినిమా టీవీల్లో కూడా ప్రసారమైంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో రాధేశ్యామ్ సినిమాను ప్రసారం చేశారు. బుల్లితెరపై కూడా ఈ సినిమాకు ఆదరణ దక్కలేదు. తొలి ఎయిరింగ్ లోనే కేవలం 8.2 టీఆర్పీ తెచ్చుకుంది ఈ మూవీ. ఓ స్టార్ హీరో సినిమాకు తొలిసారి ప్రసారం చేసినప్పుడు 10 లోపు రేటింగ్ వచ్చిందంటే అది టీవీల్లో క్లిక్ అవ్వలేదని అర్థం.

అల వైకుంఠపురములో (టీఆర్పీ-22), సరిలేరు నీకెవ్వరు (టీఆర్పీ-21) సినిమాలతో పోల్చుకుంటే రాధేశ్యామ్ దరిదాపుల్లో కూడా లేదని అర్థమౌతోంది. ఈ రేటింగ్ తో ఈ సినిమా పరాజయం పరిపూర్ణమైంది. కనీసం టీవీల్లోనైనా మంచి రేటింగ్ వస్తే పండగ చేసుకుందామని ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది.

First Published:  7 July 2022 3:32 AM GMT
Next Story