Telugu Global
National

పెళ్లి చేసుకున్న పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి వివాహం చేసుకున్నారు. హర్యానాకు చెందిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లి చేసుకున్నారు. చండీగఢ్‌లోని సెక్టర్ 2లో గల సీఎం నివాసంలోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ఈ వేడుకకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, ఎంపీ రాఘవ్ చద్దా, మాన్ తల్లి, సోదరి, కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. భగవంత్ మాన్ (48)కు […]

Bhagwant Mann
X

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి వివాహం చేసుకున్నారు. హర్యానాకు చెందిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను గురువారం ఆయన పెళ్లి చేసుకున్నారు. చండీగఢ్‌లోని సెక్టర్ 2లో గల సీఎం నివాసంలోనే అత్యంత సన్నిహితుల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ఈ వేడుకకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, ఎంపీ రాఘవ్ చద్దా, మాన్ తల్లి, సోదరి, కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

భగవంత్ మాన్ (48)కు గతంలో ఇందర్‌ప్రీత్ కౌర్‌తో పెళ్లైంది. ఆరేళ్ల క్రితం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి కూతురు సీరత్ కౌర్ మాన్ (21), కొడుకు దిల్షాన్ మాన్ (17) ఉన్నారు. వీళ్లిద్దరూ తల్లి ఇందర్‌ప్రీత్‌తో పాటే అమెరికాలో నివసిస్తున్నారు. భగవంత్ మాన్ మార్చి 16న పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాజీ భార్య, పిల్లలు వచ్చారు.

ఇక మాన్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న గుర్‌ప్రీత్ కౌర్ (32) వృత్తిరిత్యా ఒక డాక్టర్. ఆమె తండ్రి ఇందర్‌జిత్ కురుక్షేత్ర జిల్లాలో వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాన్‌కు గురు‌ప్రీత్ సాయం చేశారు. చాలా కాలంగా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉన్నది.

ఈ పెళ్లికి హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ విలేకరులతో మాట్లాడుతూ.. మాన్ ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన పెళ్లి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను అని అన్నారు. ఎంపీ చద్దా ట్విట్టర్‌లో భగవంత్ మాన్‌ పెళ్లికి సంబంధించిన ఫొటోలు పెట్టారు. పెద్దోడు సెటిల్ అయితేనే కదా చిన్నవాడి వంతు వచ్చేది.. మా పెద్ద అన్న భగవంత్ మాన్‌కు శుభాకాంక్షలు అంటూ చద్దా పోస్టు పెట్టారు.

First Published:  7 July 2022 3:52 AM GMT
Next Story