Telugu Global
National

నాలుగు దక్షిణాది రాష్ట్రాలపై కన్ను

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో సేవలందిస్తున్నవారిని ఎంపిక చేశారు ప్రధాని మోడీ.. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయేంద్ర ప్రసాద్, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్గడే, కేరళ నుంచి పి.టి. ఉష, తమిళనాడు నుంచి ఇళయరాజా ఇక ఎగువసభ సభ్యులు కానున్నారు. వీరందరినీ అయాచితంగా రాజ్యసభ పదవులు వరించనున్నాయి. వీళ్ళలో విజయేంద్రప్రసాద్ సినీ రంగానికి, పి.టి.ఉష క్రీడా రంగానికి, చెందినవారు కాగా ఇళయరాజా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నవారు. కర్ణాటకకు చెందిన […]

south india
X

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో సేవలందిస్తున్నవారిని ఎంపిక చేశారు ప్రధాని మోడీ.. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయేంద్ర ప్రసాద్, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్గడే, కేరళ నుంచి పి.టి. ఉష, తమిళనాడు నుంచి ఇళయరాజా ఇక ఎగువసభ సభ్యులు కానున్నారు. వీరందరినీ అయాచితంగా రాజ్యసభ పదవులు వరించనున్నాయి.

వీళ్ళలో విజయేంద్రప్రసాద్ సినీ రంగానికి, పి.టి.ఉష క్రీడా రంగానికి, చెందినవారు కాగా ఇళయరాజా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నవారు. కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్గడే ధార్మిక కార్యక్రమాలు ఇన్నీఅన్నీ కావు. తన 20 ఏళ్ళ ప్రాయం నుంచే తమ రాష్ట్రంలో ధర్మస్థల ఆలయ ధర్మాధికారిగా ఉన్నారు. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఎన్నో శిక్షణ సంస్థలను ప్రారంభించారు. . ఆయన కృషి ని పురస్కరించుకుని కేంద్రం దేశవ్యాప్తంగా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ ఇన్స్ టిట్యూట్ లను ఏర్పాటు చేసింది.

కర్ణాటకలో వీరేంద్ర హెగ్గడే చేపట్టిన శ్రీక్షేత్ర ధర్మస్థల రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎందరికో స్వయం ఉపాధినిచ్చింది. అలాగే ఆయన ఏర్పాటు చేసిన శ్రీధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యాన 25 స్కూళ్ళు, కళాశాలలు నడుస్తున్నాయి. 2015 లోనే ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది.

ఇక సంగీత ప్రపంచాన్ని శాసిస్తున్న ఇళయరాజా వెయ్యికి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 7 వేలకుపైగా పాటలకు బాణీలు కూర్చిన ఆయన ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 వేల కచేరీలు ఇచ్చి భారత గొప్పతనాన్ని చాటారు. 2018 లో పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఆయన 5 జాతీయ చలనచిత్ర అవార్డులను, సంగీత నాటక పురస్కారాన్ని అందుకున్నారు.

సినీ కథారచయిత, దర్శకుడు కూడా అయిన విజయేంద్రప్రసాద్ గురించి తెలియనిదెవరికి ? తెలుగు, హిందీ మూవీలకు ఆయన అందించిన అద్భుత కథనాల సమాహారం ప్రపంచ వ్యాప్తంగా భారత సినీరంగ ప్రాశస్త్యానికి బాటలు పరిచింది. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గ్లోబల్ పాపులర్ అయ్యాయంటే ఇందుకు ఆయన అందించిన కాల్పనిక, ఫిక్షన్ కథనాలే కారణం.. ముఖ్యంగా ఒకప్పుటి బాలీవుడ్ పాపులారిటీని తొక్కేసి టాలీవుడ్ పైకి వచ్చిందంటే ఇందుకు విజయేంద్రుడి కృషే కారణమన్నది జగద్విదితం.

తన కలంతో తండ్రి వీరవిహారం చేస్తే.. కుమారుడు రాజమౌళి సైతం తన దర్శకత్వ ప్రతిభతో నిజంగా ‘బాహుబలే’ అయ్యాడు. వాస్తవికతకు కాల్పనికత జోడించి అద్భుత చిత్రాలకు ఆద్యుడయ్యాడు. తాను తీసిన చిత్రాలు ప్రదర్శించే థియేటర్ల ముందు వెల్లువెత్తే ఆడియన్స్ కి
తానే కారణమయ్యాడు.

క్రీడా రంగంలో ఉత్తమ అథ్లెట్ గా నిలిచినా పి.టి. ఉషను ‘పయ్యోలి ఎక్స్ ప్రెస్’ గా కూడా వ్యవహరిస్తారు. వరల్డ్ జూనియర్ ఇన్విటేషనల్ మీట్, ఏషియన్ ఛాంపియన్ షిప్స్, ఏషియన్ గేమ్స్, వంటి పలు అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్లలో పాల్గొన్న ఈ పరుగుల రాణి దేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచింది. తన కెరీర్ లో అనేక జాతీయ ఏషియన్ రికార్డులను తిరగరాసింది.

1984 ఒలంపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ లో భారత తొలి స్వర్ణ పతకాన్ని కొద్దిలో చేజార్చుకున్నా.. ఉష ప్రతిభ అపారం. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో కేవలం ఒక్క సెకండులో వందోవంతున కాంస్య పతకాన్నిమిస్ అయింది. అథ్లెట్ గా రిటైర్ అయినప్పటికీ ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ను ఏర్పాటు చేసింది. అర్జున అవార్డు పొందిన ఉష పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.

ఇలా ఎవరికీ వారు తమతమ రంగాల్లో ప్రతిభ చాటినందుకు వీరిని ప్రధాని మోడీ రాజ్యసభకు ఎంపిక చేయడం విశేషం.

First Published:  7 July 2022 12:28 AM GMT
Next Story